రేషన్ బియ్యం అక్రమరవాణ జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొవాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

రేషన్ బియ్యం అక్రమరవాణ జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొవాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

రేషన్ బియ్యం అక్రమరవాణ జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొవాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

          జగిత్యాల, అగస్టు 07: జిల్లాలో ఎక్కడ కూడా (పిడిఎస్) రేషన్ బియ్యం అక్రమ రవాణ జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు.   శనివారం జిల్లా కలెక్టర్  కార్యాలయం నుండి రెవెన్యూ సంబంధిత అంశాలపై ఆర్డిఓలు, జిల్లా పౌరసరఫరాల శాఖ, తహసీల్దార్ లతో జూమ్ వెబ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని మండలాలలో పిడిఏస్ బియ్యం అక్రమ రవాణ జరగకుండా    అక్రమరవాణపై పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.   కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్ కొరకు వచ్చే ప్రతి దరఖాస్తును త్వరగా పరిష్కరించి లబ్దిదారులకు చెక్కులను అందించేలా చర్యలు తీసుకోవాలని,  మీసేవా సర్టిఫికేట్ల పెండెన్సిల లేకుండా త్వరగా పరిష్కరించాలని, ధరణి స్లాట్ బుక్కింగ్ పెండింగ్ లేకుండా చూడాలని,  కోర్టు ఆర్డర్ వచ్చిన వాటిపై తదుపరి కోర్టు ఆదేశాలు వచ్చే వరకు ఎటువంటి చర్యలు తీసుకోరాదని,  మీసేవా నిర్వహకులు అర్జీదారుల నుండి అధిక  ఫీజులను వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ మ్యూటేషన్ నివేధికలను సరిగా చూసుకోవాలని,  ప్రతి ధరఖాస్తును క్షుణంగా పరిశీలించాలని ఆదేశించారు.  పిఓబి పెండింగ్ లు లేకుండా చూడాలని, పంపించిన ప్రతి ధరఖాస్తుల స్థితిని పరిశీలించుకోవాలని పేర్కోన్నారు.  ప్రతి ధరఖాస్తు పై త్వరిత పరిష్కారం కావాలని సూచించారు.  ఈ ఆఫీస్ లో పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు వారంలోగా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ కేసుల వివరాలను తయారుచేసి సంబంధిత తహసీల్దార్లకు పంపించి పరిష్కరించేలా చూడాలని పేర్కోన్నారు.  ఇసుక అక్రమరవాణా జరుగకుండా నిఘాను పటిష్టం చేయాలని,  సీజ్, పెనాల్టీలకు సంబంధించిన వివరాలను సమీక్షించుకోవాలని, ప్రభుత్వ ఆదేశాల మేరకు పెనాల్టీలు విధించాలని సూచించారు.  ఎక్కడ కూడా  పిడిఎస్ రైస్ అక్రమరవాణ జరుగకుండా చర్యలు తీసుకోవాలని, దుఖానాలకు ఎంత పరిమాణంలొ బియ్యం పంపిణి చేయడం జరిగిందో పరిశీలించాలని, పిడిఎస్  బియ్యం పంపిణిలో ఎన్ని కేసులు బుక్ చేయడం జరిగింది. వాటి వివరాలను సిద్దం చేయాలని,  సోషల్ ఆడిట్ పూర్తిచేయాలని,  జిల్లా స్థాయి, మండలస్థాయి ఎన్ ఫోర్స్ మెంట్ కమిటిలను  ఏర్పాటు చేయాలని అన్నారు.   ఎఫ్ పి షాపులు నిర్దిష్ట సమయంలో ప్రారంభించేలా చూడాలని, సకాలంలో షాపులను  ప్రారంభించని వాటిన వెంటనే ప్రారభించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో కొరుట్ల ఆర్డిఓ వినోద్ కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్,  తహసీల్దార్లు, కలెక్టర్ కార్యాలయ పర్యవేక్షకులు పాల్గోన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

రేషన్ బియ్యం అక్రమరవాణ జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొవాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

రేషన్ బియ్యం అక్రమరవాణ జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొవాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

Share This Post