ఆహార భద్రత కార్డు జిరాక్స్ కాపీతో సంబందిత తహసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, 30 వ తేదిన అన్ని తహసిల్దార్ కార్యాలయాల్లో ఆధార్ కార్డు అను సంధాన ప్రక్రియ చేపట్టాలని తహసిల్దార్లను ఆదేశించారు. గ్రామ స్థాయి నుండి ప్రజలను దరఖాస్తు చేయుటకు మొబలైజ్ చేయాలని చెప్పారు. రేషన్ బియ్యం తీసుకోవడానికి ఐరిష్, ఓటిపి రాక ఇబ్బంది పడుతున్న ప్రజలను దృష్టిలో ఉంచుకుని అటువంటి వారి నుండి దరఖాస్తులు స్వీకరించి తగు చర్యలు చేపట్టేందుకు దరఖాస్తులు కోరుతున్నట్లు చెప్పారు. ప్రజలు తప్పని సరిగా దరఖాస్తు చేసికోవాలని, ఈ సద వకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవడం క్రమం తప్పక బియ్యం తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు.