రైతన్నల శ్రేయస్సే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుకు ప్రాధాన్యత …… మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

రైతన్నల శ్రేయస్సే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుకు ప్రాధాన్యత …… మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ప్రచురణార్థం

తొర్రూరు,
మహబూబాబాద్ జిల్లా, ఆగస్ట్ – 13:

రైతు రాజ్యం గా రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల అభ్యున్నతికి విశిష్ట కృషి చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

శనివారం మధ్యాహ్నం తొర్రూర్ మండలం హరిపిరాల గ్రామంలోని ఆయిల్ ఫామ్ నర్సరీలో రైతులకు మంత్రి జిల్లా కలెక్టర్ కె. శశాంకతో కలిసి మొక్కలను అందజేశారు.

రైతులు మొక్కల కొరకు నమోదు చేసుకున్న వారికి మంత్రి కలెక్టర్లు ఆయిల్ ఫామ్ మొక్కలను అందజేసి కాసేపు నర్సరీలో తిరుగుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, రైతుల వ్యక్తిగత వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట కృషి చేస్తుందని, ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు ఎంతో లాభదాయకమని, 3సంవత్సరాలు నాటిన మొక్కలను కంటికి రెప్పలా కాపాడే గలిగితే 30 సంవత్సరాల వరకు మన కుటుంబాన్ని జీవన ఉపాధి కల్పిస్తూ ఆయిల్ ఫామ్ సాగు తోడ్పాటు ఇస్తుందని, కోతుల బెడద, జంతువుల నుండి ఎలాంటి నష్టం ఉండదని, ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం సబ్సిడీ మొక్కలకు అందిస్తూ, డ్రిప్పు సబ్సిడీ సౌకర్యం కూడా కల్పిస్తుందని, 85 ఎకరాల్లో మన ప్రాంతంలో ప్రభుత్వ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని గోపలగిరి ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నామని,50 ఎకరాల్లో 150000 మొక్కలను నర్సరీ లో ఉంచి రైతులకు అందిస్తున్నామని, 6 నెలల మొక్కలు 2 సంవత్సరాల మొక్క అంత సైజులో నాణ్యతగా నర్సరీ లో అందుబాటులో ఉన్నాయని ఒక చెట్టుకు 12 నుండి 18 గెలలు వస్తాయని, ప్రభుత్వమే రైతుల వద్ద నుండి కోoటుందని, రైతుకు భారం కాకుండా రవాణా ఖర్చులు కూడా ఆయిల్‌ఫెడ్ సంస్థనే భరిస్తుందని, పామాయిల్ సాగు ను ప్రయోగాత్మకంగా మన ప్రాంతంలో వేసి అధిక లాభాలు పొందుతున్నామని, అన్ని పంటల్లో కెల్లా ఆయిల్‌పామ్ సాగు లాభదాయకమని, 74.24 శాతం పండిన పంటలో రైతు వాటా ఉంటుందని, మిగతా శాతం మాత్రమే కంపెనీకి వర్తిస్తుందని, నా జీవితం ఒక రైతు గా మొదలైందని, గతంలో అనేక నష్టాలు ఎదుర్కొన్నానని ఆయిల్ ఫామ్ సాగులో అధిక లాభాలు రావడం వల్ల నేను కూడా వేయుటకు ప్రణాళికలు రూపొందించుకొని సిద్ధంగా ఉన్నామని, మన జిల్లాలోనే 7వేల ఎకరాల్లో పామాయిల్ తోట నాటుటకు ప్రణాళికలు సిద్ధం చేశారని, మొక్కలు చాలా అద్భుతంగా ఎదిగి వచ్చాయని, 2 కోట్ల రూపాయల వ్యయంతో డబల్ రోడ్డు చెర్లపాలెం, ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వరకూ రవాణా ఇబ్బంది కలగకుండా రోడ్డు నిర్మాణ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మొక్కలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

జిల్లా కలెక్టర్ శశాంక్ మాట్లాడుతూ, రైతులందరూ ప్రత్యామ్నాయ పంటలు వేసుకొని లాభాలు ఆర్జించాలని, జిల్లాలో అందుబాటులో ఆయిల్ఫామ్ సాగు కొరకు మొక్కలు అందుబాటులో ఉన్నాయని, రైతులు అందరూ వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.

నర్సరీ అభివృద్ధికి విశిష్ట కృషి చేసిన ఉద్యానవన శాఖ అధికారి సూర్యనారాయణ, ఆర్టీవో రమేష్ ను, తాసిల్దార్ రాఘవరెడ్డి ని మెమొంటో, శాలువా కప్పి మంత్రి ఘనంగా వారిని మంత్రి అభినందించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఎండి సురేందర్ రెడ్డి, జిఎం సుధాకర్ రావు, ఎంపీపీ చిన్న అంజయ్య, జెడ్ పి టి సి మంగళపల్లి శ్రీనివాస్, ప్యాక్స్క్స్ చైర్మన్ కాకి రాల హరి ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ పసుమర్తి శాంత, కోఆర్డినేటర్ శ్రీకాంత్ రెడ్డి, డి హెచ్ ఎస్ ఓ సూర్యనారాయణ, ఆర్డిఓ రమేష్ బాబు, తహసిల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీవో కుమార్,ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Share This Post