పత్రికా ప్రకటన తేది 07-01 -2022
రైతన్న సంక్షేమానికి అండగా తెలంగాణ ప్రభుత్వం ఉందని జాడ్పి చైర్మెన్ సరిత తిరుపతయ్య అన్నారు.
తెలంగాణాలో వారం రోజులపాటు రైతు బంధు సంబరాలలో భాగంగా శుక్రవారం అలంపూర్ మండల పరిధిలోని క్యాతూర్ గ్రామంలోని జెడ్పి హైస్కూలులో రైతు బంధు సంబరాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య హాజరైయ్యారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు వేసిన ముగ్గు లను విద్యార్థిని లతో కలిసి సందర్శించి మాట్లాడుతూ రైతు బంధు సంబరాలు పాఠశాలలో ఎందుకు నిర్వహిస్తున్నారంటే ఇక్కడ చదివే ప్రతి ఒక విద్యార్థి రైతు బిడ్డలే ఉంటారు, కాబట్టి వారికి రైతాంగం పట్ల అవగాహన కుడా చాలా అవసరమని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత రైతుల పట్ల గౌరవం పెంచాలనే కృషితో రైతుల కోసం రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారు ప్రవేశ పెట్టారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో 50వేల కోట్ల రూపాయలు చేరనున్న సందర్బంగా ఈ సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో పరిమితులను గుర్తుంచుకొని సంబరాలు చేపట్టడం జరిగిందన్నారు. అనంతరం సాంస్కృతిక కళాకారులను జెడ్పి చైర్ పర్సన్ సన్మానించారు. చిత్రలేఖనం, ముగ్గుల పోటీ, వ్యాసరచన పోటీలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ లలితమ్మ, ఉప సర్పంచ్ బాలాసాహెబ్, పాఠశాల హెచ్ఎం బాలాజీ కృష్ణకుమార్, సింగిల్ విండో చైర్మన్ రాఘవ రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ లింగనవాయి కృష్ణ ,ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
——————————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ జిల్లా గారిచే జారీ చేయనైనది.