రైతాంగం సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.

ప్రచురణార్ధం

జనవరి 09 ఖమ్మం

రైతాంగం సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఆదివారం రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో జరిగిన రైతుబంధు సంబరాలలో మంత్రి పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చిత్రపటానికి పాలభిషేకం. చేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గత మూడెళ్ళ కాలంలో 50 వేల కోట్లు ఆర్ధిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అందించిందని మంత్రి తెలిపారు. ఖమ్మం జిల్లాకు ఈ సీజన్కు సంబంధించి 316 కోట్లు రైతుబంధును విడుదల చేసిందని. ఇప్పటి వరకు 276 కోట్లు రైతుల ఖాతాలకు జమ అయ్యాయని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. 2018. వానాకాలం సీజన్ మొదలుకొని 2021 యాసంగి సీజన్ వరకు 2 వేల 337 కోట్లు రైతుబంధు పథకం క్రింద ఖమ్మం జిల్లాలోని రైతులకు అందించడం జరిగిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. రఘునాథపాలెం మండలానికి సంబంధించి 2018 నుండి ఇప్పటి వరకు 15 వేల 309 మంది రైతులకు 128 కోట్లు రైతుబంధు క్రింద అందించామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు రైతులు వ్యవసాయానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని సరియైన విద్యుత్ సౌకర్యం, సాగునీటి వసతి లేకపోవడం, ఎరువులు, విత్తనాల కోసం రోజుల తరబడి వేచియుండడం, పంట పెట్టుబడి కోసం ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించడం వంటి సమస్యల వల్ల గతంలో రైతాంగం అనేక ఇబ్బందులు ఎదుర్కొందని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగలా చేసిందని, ప్రతి ఎకరానికి 10 వేల చొప్పున రైతుబంధు, దురదృష్టవశాత్తు మరణించిన రైతు కుంటుంబానికి రైతుఖీమా ద్వారా ఆర్ధిక సహాయం అందించి ప్రభుత్వం ఆదుకుంటున్నదని మంత్రి తెలిపారు. కరోనా క్లిష్ట సమయంలో కూడా ఆగని పథకం రైతుబంధు ఒక్కటే అని మంత్రి అన్నారు. బంగారు తెలంగాణ సాకారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి మేలు చేకూర్చే దిశగా వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసి రైతులకు పెట్టుబడి సాయం కింద అందిస్తున్న రైతుబంధు ఆర్ధిక సహాయం 50 వేల కోట్ల రూపాయల మైలురాయిని చేరిందని, ఈ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు సంబరాలు పెద్దఎత్తున నిర్వహించుకుంటున్నట్లు మంత్రి పువ్వాడ అజయకుమార్ తెలిపారు. యాసంగిలో ఎఫ్.సి.ఐ రాష్ట్రం నుండి ధాన్యం కొనుగోలు చేయదని స్పష్టం చేసినదని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండబోవని, కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నదని ఇట్టి విషయాన్ని గమనించి రైతులు యాసంగిలో వరి వేసి నష్టపోకుండా వ్యవసాయ అధికారులు సూచనల మేరకు డిమాండ్ కలిగిన ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని మంత్రి కోరారు.

జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని రైతులను ఆర్థిక పరంగా ఆదుకునేందుకు, వ్యవసాయాన్ని పండుగలా చేయాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రివర్యులు రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టి 8 విడతలుగా ఇప్పటి వరకు 50 వేల కోట్లు రైతుల ఖాతాకు జమ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. రానున్న కాలంలో కూడా రైతుబంధు పథకం యధావిధిగా కొనసాగుతుందని జిల్లా పరిషత్ చైర్మన్ తెలిపారు.

కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, డి.సి.సి.బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, రఘునాథపాలెం జడ్పీ.టి.సి మాలోతు ప్రియాంక, ఎం.పి.పి. భూక్యా గౌరీ, సర్పంచ్ కృష్ణవేణి, వైస్ ఎం.పి.పి. రవి, రైతుబంధు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్ సుధాకర్, ఖమ్మం వ్యవసాయ కమిటీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, జిల్లా వ్యవసాయ శాఖాధికారి విజయనిర్మల, జిల్లా సహాకార శాఖాధికారి విజయకుమారి, వ్యవసాయ: శాఖ ఏ.డి. శ్రీనివాసరావు, తహశీల్దారు నర్సింహారావు, ఎం.పి.డి.ఓ మండల వ్యవసాయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post