రైతాంగ పోరాటానికి స్ఫూర్తి చాకలి ఐలమ్మ…

ప్రచురణార్థం

రైతాంగ పోరాటానికి స్ఫూర్తి చాకలి ఐలమ్మ…

మహబూబాబాద్ సెప్టెంబర్ 26.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తిగా చాకలి ఐలమ్మ నిలిచారని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు.

ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో 126వ చాకలి ఐలమ్మ జన్మదినోత్సవ వేడుకలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ శశాంక పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చేసి వీర వనితగా చరిత్రలో నిలిచిపోయారన్నారు.
అటువంటి వీర ధీర వనితను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

సంఘసేవకురాలు గా భూస్వాముల పెత్తనం దోపిడి నిరంకుశ పాలన ఎదురొడ్డి సాహసంగా పోరాడిన చాకలి ఐలమ్మ తెలంగాణ వీర వనితగా ప్రతి ఒక్కరికి స్ఫూర్తి గా నిలిచారన్నారు.

ఆమె ఆశయాలను నేటి తరంవారు కొనసాగిస్తూ న్యాయం చేకూరే వరకు పోరాడాలన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ రెవెన్యూ అదనపు కలెక్టర్ కొమరయ్య శిక్షణ కలెక్టర్ అభిషేక్ అగస్త్య అధికారులు సిబ్బంది రజక సంఘ నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
—————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post