రైతుకు మించిన శాస్త్రవేత్త ఈ ప్రపంచం లొనే లేడని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతులను కొనియాడారు

రైతుకు మించిన శాస్త్రవేత్త ఈ ప్రపంచం లొనే లేడని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతులను కొనియాడారు.

సోమవారం మక్తల్ రైతు సదస్సు లో   వ్యవసాయ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమానికి  వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ సందర్బంగా  ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి వ్యవసాయం చేసుకుంటూ   తనకు ఒక సంవత్సరం  నష్టం వచ్చినా పంట పండించడం మానడని  రైతు గొప్పతనాన్ని చాటి చెప్పారు.  వ్యవసాయ రంగం బాగు పడితే 60 శాతం జనాభాకు ప్రత్యక్షంగా నో పరోక్షంగా నో జీవనోపాధి దొరుకుతుందని తెలిపారు.  ఇంతటి గొప్ప రంగం మరోకటి లేదని అందుకే తెలంగాణా రాష్ట్రం వ్యవసాయ రంగం బలోపేతానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. వ్యవసాయ రంగానికి అనుసంధానంగా చాలా రంగాలు ఉన్నాయని  వాటన్నింటి ద్వారా చాలా మందికి  ఉపాధి దొరుకుతుందని తెలియజేసారు.  లాభపడుతాడు రైతు.  రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు లాభాన్ని చేకూర్చాలనే  ఉద్యేశం తో గత  7 ఏళ్లుగా అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు  చేపట్టారని పేర్కొన్నారు. లక్ష 60 మెట్రిక్ టన్నుల వరి ని పండించడం జరిగిందని 60 లక్ష ల 85 వేల మంది కి రైతు బంధు ఇవ్వడం జరిగిందని. భారత దేశం లో వరి పండించే రాష్ట్రాల్లో తెలంగాణా రాష్ట్రం అగ్రస్థానానికి చేరుకుందని,   తెలంగాణ లో గరిష్టంగా పంటలను పండించడం జరుగుతోందని దేశం అధికంగా పండించి కేంద్రాన్ని కి కోన మని చెబితే కేంద్రం కొనడానికి ముందుకు రావడం లేదని  అందుకే రైతులు ప్రత్యేనమేయ పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని  దేశం లో పత్తి పండించడం లో 3 స్థానం లో ఉందని తెలంగాణ లో పండించే పత్తి కి మంచి ధర ఉన్నదని వచ్చే వర్షాకాలం లో పత్తి, కంది ని పండించాలని రాబోయే 2 సంవత్సర లలో  యసంగి లో మాత్రం వరి కి బదులు గా పంట మార్పిడి చేయాలని సూచించారు. యసంగి లో వరి వేసుకునే రైతులు స్వతహాగా అమ్ముకోవలని సూచించారు.  యసంగి లో రైతులకు మేలు జరగాలని అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేనమేయ పంటలు వేరు శసినిగా, పొద్దు తీరుగుడు, పెసర, చెరుకు, మినుము, అలచందలు వేసుకొని లాభ పడాలని సూచించారు. ఆయిల్ ఫామ్ పెంపకం పై రైతు లు ప్రధానంగా దృష్టి సారించాలని కంది సాగు కంటే ఆయిల్ ఫామ్ వలన అధిక లాభాలు ఉన్నాయని దేశములో ఆయిల్ ఫామ్ పెంచడం వలన వంట నూనె ల కొరతలను తగించవచ్చన్నారు. అన్ని పంటల కన్నా లాభదాయకం మైనది పేర్కొన్నారు. అంతకు ముందు వ్యవసాయ శాస్త్రవెతలు రైతుల అనుమానాల నిరుత్తి చేస్తూ అవగాహన కల్పించారు. యాసంగి లో వరి కి బదులు ప్రత్యన్మేయ పంట సాగు చేసేటట్లు వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహనా కల్పించాలని జిల్లా కలెక్టర్ డి హరిచందన పేర్కొన్నారు.మక్తల్ శాసన సభ్యులు చిట్టెం రామ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ తనే స్వయంగా ఆయిల్ ఫామ్  తోట ను సాగు చేస్తునానని రైతులు ప్రత్యన్మేయ పంట పందిన్చాలన్నారు.

ఈ కార్యక్రమం లో జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, అర్దిఒ వెంకటేశ్వర్లు, చిట్టెం సుచరిత, శాస్త్రవెతలు దామోదర్ రాజు, శాకిఎర్ అలీ, విజయ్ కుమార్, మార్కెట్ కమీటి చైర్మన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post