రైతుబంధు ఘనత తెలంగాణ రాష్ట్రానిదే…

రైతుబంధు ఘనత తెలంగాణ రాష్ట్రానిదే…

ప్రచురణార్థం

రైతుబంధు ఘనత తెలంగాణ రాష్ట్రానిదే…

మహబూబాబాద్ , జనవరి 7.

రైతుబంధు ఘనత తెలంగాణ రాష్ట్రాన్ని దేనని రాష్ట్ర గిరిజన సంక్షేమం మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ స్పష్టంచేశారు.

శుక్రవారం జిల్లా కేంద్రంలోని రైతు వేదిక లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రైతుబంధు సంబరాల కార్యక్రమం లో మంత్రి పాల్గొని జిల్లా కలెక్టర్ శశాంక, జడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, శాసనసభ్యులు బానోతు శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి లతో కలిసి కేక్ ను కట్ చేశారు. అనంతరం ఇద్దరు రైతులను శాలువాలు కప్పి సత్కరించారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుబంధు సంబరాలు కరపత్రాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మహబూబాబాద్ శాసనసభ్యులు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా ఎన్ని అవాంతరాలు వచ్చినా నిరంతరాయంగా కొనసాగిస్తున్న అద్భుతమైన పథకం రైతు బంధు అని, రైతుబంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్రాన్ని దేనని రాష్ట్ర గిరిజన సంక్షేమం మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ స్పష్టంచేశారు.

రైతుల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీసుకుంటున్న శ్రద్ధ అనిర్వచనీయమైనది మంత్రి కొనియాడారు.
ఆరుగాలం కష్టించి శ్రమించే రైతన్నకు అండదండగా ఉండాలనే గొప్ప ఉద్దేశంతో గతంలో జిల్లాలో 125 కోట్లు ఉన్న రైతుబంధు 202 కోట్లకు చేరుకున్నదని, రాష్ట్ర ప్రభుత్వానికి కరోనాతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అధికారులు ప్రజాప్రతినిధుల వేతనాలను సైతం నిలుపుదల చేసి రైతుబంధు ప్రాధాన్యత ఇవ్వడం రైతు పక్షపాత ప్రభుత్వం గా పేర్కొన్నారు.

రైతులు కూడా ప్రభుత్వానికి సహకరించి ప్రత్యామ్నాయ పంటల ను చేపట్టి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు.

జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకం సొమ్మును నేరుగా రైతుల ఖాతాల్లోకి మళ్లించిన ఘనత తెలంగాణకే దక్కిందన్నారు. జిల్లాలో 82 రైతు వేదికలు నిర్మించుకున్నామని రైతులకు అవగాహన సదస్సు లు ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ పంటలు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు జిల్లాలో ఆయిల్ ఫామ్ తోటలకు అనువుగా ఉన్నందున రైతులను ప్రోత్సహిస్తున్నామని తెలియజేశారు.

జెడ్పి చైర్ పర్సన్ ఆంగోతు బిందు మాట్లాడుతూ ఎకరానికి 10 వేలు పెట్టుబడిగా అందజేసే రైతుబంధు పథకం రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉందన్నారు. రైతు భీమా పథకం ఏర్పాటుచేసి భరోసా కల్పించారన్నారు సాగునీరు నాణ్యమైన విద్యుత్తు రైతులకు వరంగా నిలిచిందన్నారు.

శాసనమండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ రైతులు పడే ఇబ్బందులను ప్రత్యక్షంగా గమనించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీసుకున్న బృహత్తర నిర్ణయం దేశానికే ఆదర్శం గా నిలిచిందని అన్నారు. 30 సంవత్సరాలుగా చుక్క నీరు లేని ఎస్సారెస్పీ కాల్వలకు కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి జలాలు అందించి బీడు భూములను బంగారు భూములుగా సస్యశ్యామలం చేసిన ఘనత ముఖ్యమంత్రికే చెల్లిందన్నారు.

మహబూబాబాద్ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ అన్నదాతకు అండగా నిలిచిన ప్రభుత్వానికి ప్రజలు జేజేలు పలుకుతున్నా రని అన్నారు. గిరిజన తండాలు గూడాలు పంచాయతీలుగా మార్చడంతో అభివృద్ధి వేగవంతంగా మారిందని బంగారు తెలంగాణ దిశగా పయనిస్తుందని అన్నారు మెడికల్ కళాశాల మంజూరు చేసుకున్నామని పాలిటెక్నిక్ కళాశాల నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్ జిల్లా ఉద్యాన అధికారి సూర్యనారాయణ జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు పాష రైతుబంధు కోఆర్డినేటర్ రాజు ప్రజాప్రతినిధులు అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు
——————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post