రైతులందరికీ మేలు జరిగే దిశగా ప్రభుత్వం కృషి : రాష్ట్ర మంత్రివర్యులు అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

రైతులందరికీ మేలు జరిగే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని, వరద పరిస్థితుల వల్ల నటపోయిన రైతులకు సాయం చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, న్యాయ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్ది అన్నారు. బుధవారం జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో వరద పరిస్థితిపై ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రభుత్వ విప్‌, చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు బాల్క సుమన్‌, జిల్లా కలెక్టర్‌ భారతి హోళీకేరి, శాసనమండలి సభ్యులు పురాణం సతీష్‌ తో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వర్యులు మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెన్నూరులో చాలా పంట నష్టం జరిగిందని, మహారాష్టలో 25 సెంటీమీటర్ల వర్షం పడడంతో అన్ని ప్రాజెక్టుల నుండి ఒకేసారి నీటి విడుదల చేయడం జరిగిందని, 2013 యాక్ట్‌ ప్రకారం భూముల ధరలు ప్రకారముగా నివేదిక అందించడం జరుగుతుందని, కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్నో ప్రయోజనాలు జరుగుతున్నాయని అన్నారు. గ్రామాలలో జరిగిన పంట నష్టంపై నివేదికలతో పాటు విద్యుత్‌, రహదారులపై పర్యవేక్షించి అందరికీ తగు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, కెనాల్‌ ఏర్పాటు, అటవీ జోడు వాగుల దగ్గర పూర్తి పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందించి ఆ ప్రకారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చెన్నూర్‌కు వంద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, జగ్ధల్‌పూర్‌ రహదారి అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం విప్‌ మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గంలో నదీ పరివాహక ప్రాంతాలైన చెన్నూర్‌, కోటపల్లి తదితర గ్రామాలలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ప్రాణహిత, గోదావరి నదులు ఉప్పాంగడంతో వరద పరిస్థితులు ఏర్పడటంతో చాలా పంట నష్టం జరిగిందని, ఇందువలన నష్టపోయిన రైతుల బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సహాయం అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వర్షాల కారణంగా నియోజకవర్గంలోని మండలాల వాదీగా జరిగిన నష్టంపై నివేదిక తయారు చేసి, ఆ ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలోని రహదారులు బాగు చేయాలని ప్రజలు కోరగా దీనిపై స్పందించిన మంత్రి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో3 పెద్ద ప్రాజెక్టులు, సుందిళ్ల అన్నారం, మేడిగడ్డ మధ్యతరహా ప్రాజెక్టులు, గొల్ల వాగు, నీల్వాయి ప్రాజెక్టు లతోపాటు 845 ట్యాంకులు ఉన్నాయని, బ్యాక్‌ వాటర్‌ కారణంగా మొత్తం 7 వేల ఎకరాలలో పంట నష్టం జరగగా 1500 మంది రైతులు నష్టపోవడం జరిగిందని తెలిపారు. ప్రాజెక్టుల కింద ముంపుకు గురయ్యే భూములపై ఇరిగేషన్‌ శాఖ ద్వారా నివేదిక తీసుకుని, దీనితోపాటు ప్రజాభిప్రాయం సేకరించి నివేదికను ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుందని, ప్రజలు సహకరించాలని తెలిపారు. అనంతరం భీమారం మండల కేంద్రంలో పది ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన బృహత్‌ పల్లె ప్రకృతి వనం కార్యక్రమంలో భాగంగా చెట్లు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రాజస్వ మండల అధికారి వేణు, డి. సి. ఎం. ఎస్‌. చైర్మన్‌ లింగయ్య, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

 

 

Share This Post