రైతులకు అండగా ఉండేందుకే.. ధాన్యం కొనుగోలుకు సి.ఎం. నిర్ణయం: జిలా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి అరుణ రాఘవ రెడ్డి

*రైతులకు అండగా ఉండేందుకే….*
*ధాన్యం కొనుగోలు కు సిఎం నిర్ణయం*
*:జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి అరుణ రాఘవ రెడ్డి*

——————————

అయోమయంలో ఉన్న రైతాంగానికి చేయూత నిచ్చెందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ధాన్యం కొనుగోలు కు నిర్ణయం తీసుకున్నారని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి అరుణ రాఘవ రెడ్డి అన్నారు.
జిల్లాను అన్ని రంగాలలో ముందు వరుసలో నిలిపినట్టే … ధాన్యం సేకరణలో రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ను ముందంజలో నిలపాలని ZPP చైర్ పర్సన్ క్షేత్ర ప్రజా ప్రతినిధులు, అధికారులను కోరారు.

గురువారం జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభo కానున్న దృష్ట్యా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన, లాజిస్టిక్ సమకూర్చడం తదితర అంశాలపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీ ఖిమ్యా నాయక్ , జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి అరుణ రాఘవరెడ్డి, కేడీసీసీ బ్యాంక్ రాష్ట్ర చైర్మన్, టేస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు శ్రీ గడ్డం నర్సయ్య, సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ శ్రీమతి జిందo కళ చక్రపాణి తదితరులతో కలిసి IDOC నుండి వర్చువల్ మీటింగ్ నిర్వహించారు.
ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ లు, AMC చైర్మన్ లు, పాక్స్ అధ్యక్షులు, రైతు బంధు సభ్యులు, తహశీల్దార్ లు, ఎంపిడివో లు, mao లు తదితరులు వర్చువల్ మీటింగ్ లో పాల్గొన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి శ్రీ కే తారక రామారావు ప్రత్యేక చొరవతో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ రంగాలలో తనదైన ప్రత్యేకత చాటుకుంటున్న తరుణంలో ధాన్యం కొనుగోలు చేయమనే కేంద్రం నిర్ణయం రైతులకు గుదిబండ గా మారిందన్నారు.
ఫలితంగా ఈ నిర్ణయం రైతులకు శరాఘాతంగా పరిణమించిందని అన్నారు.

అన్ని విధాలుగా రైతులకు అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం….
ఈ విషయంలో కూడ వెన్నంటే ఉండాలని భావించి వడ్ల కొనుగోలు చేస్తుందన్నారు. క్షేత్ర స్థాయిలో ఏమైనా లోటు పాట్లు ఉంటే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకు రావాలని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి అరుణ రాఘవ రెడ్డి అన్నారు.

కేంద్రం సహకరించకున్నా.. గతంలో వడ్లను కొనుగోలు చేసేది లేదని చెప్పినప్పటికీ.. కేవలం రైతులను ఆదుకోవాలన్న సంకల్పంతోనే రైతు పక్షపాతిగా సీఎం మరోసారి ధాన్యం కొనుగోలు చేస్తున్నారన్నారనీ కేడీసీసీ బ్యాంక్ రాష్ట్ర చైర్మన్, టేస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు తెలిపారు.
కొనుగోలు సన్నద్ధతలో కొంత ఆలస్యం అయినప్పటికీ ఇది మనందరికీ కొత్త విషయమేమీ కాదని ఆయన అన్నారు 16 సంవత్సరాల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో లో ఉన్న దృష్ట్యా అదే స్ఫూర్తితో అధికారులు అన్ని విధాలుగా సర్వసన్నద్ధంగా ఉండాలని అని అన్నారు.

ధాన్యం సేకరణలో దేశంలోనే తెలంగాణ కు తిరుగులేని అనుభవం, రికార్డ్ అధికారులకు ఉందని తెలిపారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాగుతున్న కొద్దీ
ఇంకా ఏమైనా లాజిస్టిక్ అవసరమైన, సమస్యలు ఉత్పన్నమైనా జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి పరిష్కారం చూపుతుందన్నారు. ప్రధానంగా ట్రాన్స్పోర్ట్ , మిల్లర్ తో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వీటిని అధికమించెందుకు పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక తో జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతుందన్నారు.

ఎండాకాలం దృష్ట్యా రైతులకు, హమాలీలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద టెంట్, త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు.

స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు వందశాతం క్రీయాశీలక భాగస్వామ్యం అయి కొనుగోలు ప్రక్రియ విజయవంతం అయ్యేలా చూడాలన్నారు.

రైతుబంధుసమితి జిల్లా అధ్యక్షులు శ్రీ గడ్డం నర్సయ్య మాట్లాడుతూ…
ఓ రైతుగా, రైతుబాంధవుడుగా ఆలొచించి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వడ్లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా వడ్ల కొనుగోలు కు ముందుకు వచ్చారని అన్నారు. రైతుల శ్రేయస్సు కోరి సాహసోపేత నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రి శ్రీ కే టి ఆర్ కు ధన్యవాదాలు అని తెలిపారు.

కరోనా క్లిష్ట పరిస్థితుల్లో నే దిగ్విజయంగా వడ్లు కొనుగోలు చేసిన అధికారులు…
ఈ సారి కూడ అదే స్పూర్తి తో రైతులకు ఇబ్బందులూ తలెత్తకుండా వడ్లు కొనుగోలు చేయాలని కోరారు. లాజిస్టిక్ ఏమైనా పని చేయకుంటే వెంటనే మరమ్మతులు చేసి కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు.

జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీ ఖీమ్యా నాయక్ మాట్లాడుతూ…

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలనీ క్షేత్ర అధికారులను ఆదేశించారు.

జిల్లాలో 1,18,893ఎకరాల్లో వరిసాగయ్యిందని, 2,97,232 మెట్రిక్‌టన్నుల ధాన్యం దిగుబడి అంచనా ఉందని, వచ్చే ధాన్యం మొత్తం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర గ్రేడ్ A రకం రూ. 1960 , సాధారణ రకం రూ.1940 కు ధాన్యం కొంటామన్నారు.

ఇందుకు కోసం జిల్లా వ్యాప్తంగా ఐకేపీ ఆధ్వర్యంలో 66, ప్యాక్స్ ఆధ్వర్యంలో 185, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 9, మెప్మా ఆధ్వర్యంలో 3, AMC ఆధ్వర్యంలో 2 మొత్తం 265 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.
క్షేత్ర స్థాయిలో డిమాండ్ ను బట్టి మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

జిల్లాలో ధాన్యం కొనుగోలు కు మొత్తం 75 లక్షల గన్ని బ్యాగులు అవసరం కాగా…. ప్రస్తుతం 12 లక్షల 46 వేలు అందుబాటులో ఉన్నాయనీ మిగతా బ్యాగులను సాధ్యమైనంత త్వరగా సమకూర్చూతామనీ తెలిపారు.
గన్ని బ్యాగుల కొరత లేకుండా చూసేందుకు తహశీల్దార్ స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించాలని జిల్లా రెవెన్యూ అదనపు సూచించారు.
ధాన్యం అన్ లోడింగ్ సజావుగా, వేగంగా జరిగేలా చూసేందుకు జిల్లాలోని ప్రతి రైస్ మిల్ వద్ద ఒక్కో VRO ను ప్రత్యేక అధికారిగా నియమించామని తెలిపారు.
ధాన్యం ప్రాసెసింగ్ వేగంగా జరిగేలా చూడడం, మిల్ ల వద్ద గన్నిలను పౌర సరఫరాల అధికారి కి పంపడం వంటి బాధ్యతలను ప్రత్యేక అధికారులు చూడాలని అన్నారు.

కొనుగోలు కేంద్రాల వద్ద సరిపడా మాయిచ్చర్ మిషన్, తూకం పరికరాలు, తదితర ఇతర సామగ్రి సమకూర్చుతామనీ అధికారులకు సూచించారు. వాటి పనితీరును పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పరిశీలించి ఏమైనా మరమ్మతులు ఉంటే వెంటనే చేపట్టి వాటీనీ వినియోగంలోకి తీసుకురావాలన్నారు.

ధాన్యం నిల్వకు సరిపడా స్టోరేజ్ పాయింట్ లను వెంటనే గుర్తించాలని అధికారులకు సూచించారు.

హమాలీ లు, కంప్యూటర్ ఆపరేటర్ ల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని DRDO లకు సూచించారు.

కేంద్రాలలో కొనుగోలు సిబ్బంది, రైతులు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని, టెంట్, తాగునీరు తదితర సౌకర్యాలు కలిపించాలని ఆదేశించారు.

సేకరించిన ధాన్యం రవాణాకు సరిపడా వాహనాల ఏర్పాటు చేయాలని రవాణా అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు.

 

జిల్లాలో ఎక్కడైనా ధాన్యం కొనుగోలులో ఎవేని సమస్యలు ఎదురైతే గుర్తించి వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తేవాలని అదనపు కలెక్టర్ సూచించారు.
ప్రతీ రోజు ధాన్యం సేకరణ వివరాల నివేదికలను సమర్పించాలని పౌర సరఫరాల అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు.

యూరియా, ఫెర్టిలైజర్ లు స్టాక్ పెట్టుకోండి: అదనపు కలెక్టర్

ప్రస్తుతం యూరియా, ఫెర్టిలైజర్ లు ప్రభుత్వం సరఫరా చేస్తుందని స్టాక్ పెట్టుకోండి అదనపు కలెక్టర్ తెలిపారు.
సొసైటీ డబ్బులతో రైతుల అవసరాల కు అనుగుణంగా యూరియా, ఫెర్టిలైజర్ లు కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకోవాలని అదనపు కలెక్టర్ పాక్స్ అధ్యక్షులు కు సూచించారు.
ఉక్రెయిన్ -రష్యా యుద్ధం నేపథ్యంలో మరింతగా వీటి ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు. కొరత కూడ ఏర్పడు తుందన్నారు. నిల్వలు సరిపడా ఉంటే రైతులకు ఇబ్బంది ఉండదన్నారు.

*ధాన్యం కొనుగోలుకు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్*

కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలును మానిటర్ చేయనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ తెలిపారు.

ధాన్యం కొనుగోళ్లలో ఎదురయ్యే సమస్యలనూ ఎప్పటికప్పుడు పరిష్కరించేలా జిల్లా అధికార యంత్రాంగం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నదనీ తెలిపారు.

క్షేత్ర స్థాయిలో ధాన్యం కొనుగోలలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే….
*మొబైల్ నంబర్ 6303928692* ఫోన్ చేసి సమాచారం అందిస్తే వెంటనే పరిష్కారం చూపుతామని జిల్లా అదనపు కలెక్టర్ తెలిపారు.

సమావేశంలో వేములవాడ ఆర్డీఓ లీల, dcso జితేందర్ రెడ్డి, dmcs హరి కృష్ణ, dto కొండల్ రావు, dao రణధీర్ కుమార్, dco బుద్ధ నాయుడు, dmo ప్రవీణ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, తహశీల్దార్ విజయ్ కుమార్
తదితరులు పాల్గొన్నారు
——————————

Share This Post