రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కోనుగోలు ప్రకీయ పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

ప్రచురణార్థం..1 తేదిః 22-11-2021
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కోనుగోలు ప్రకీయ పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, నవంబర్22: జిల్లాలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ధాన్యం కోనుగోలు ప్రకీయ పూర్తి చేయాలని కోనుగోలు కేంద్రాల నిర్వహకులను జిల్లా కలెక్టర్ జి. రవి ఆదేశించారు. ఈ సందర్బంగా సోమవారం ఐకేపి పరిదిలో గల మల్యాల మండలం ముత్యంపేట, లంబాడిపల్లి, గొల్లపెల్లి మండలంలోని శంకర్ రావు పేట లలో, ఎఎంసి పరిదిలోని గొల్లపల్లి మండల కేంద్రంతో పాటు మల్యాల మండల కేంద్రం మరియు ప్యాక్స్ పరిధిలోని మల్యాల మండలంలోని నూకపెల్లి, పెగడపెల్లి మండలంలోని బతికేపల్లి, రాంనూర్ , గొల్లపెల్లి లొని ఇబ్రహీంనగర్ కోనుగోలు కేంద్రాలలో కోనుగోలు కేంద్రాలలోని దాన్యం నాణ్యత ప్రమాణాలను, తేమ శాతాన్ని తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రం నిర్వహకుల ద్వారా రైతులు తీసుకువచ్చే దాన్యం ప్రమాణాలను ఏవిధంగా పరీక్షించి నిర్దారిస్తున్నది స్వయంగా పరిశీలించారు.
వ్యవసాయ అధికారుల ధ్రువీకరణ లేనిది ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కొనుగోలు చేయరాదని, కొనుగోలు చేసిన దాన్యం వివరాలను ఎప్పటి కప్పుడు ట్యాబ్ ఎంట్రీలు చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సజావుగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలును వెంటనే తరలించాలని ఆదేశించారు. కోనుగోలులో జాప్యం జరగడానికి వీలులేదని అధికారులను ఆదేశించారు. కొనగోలు కేంద్రాలకు దాన్యాన్ని తీసుకువచ్చిన రైతులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ధాన్యం ఎప్పుడు తెచ్చారు, తేమశాతం ఏ విధంగా ఉంది వంటి పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. దాన్యం కొనుగోలులో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిర్దారించిన నాణ్యత ప్రమాణాలతో ఉన్న చివరి దాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. వాతావరణంలో వస్తున్న మార్పులు, మరియు చిరుజల్లులు కురవడం వల్ల తేమశాతం పడిపోకుండా దాన్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట పిడి డిఆర్డిఓ ఎస్. వినోద్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్, డిసిఎస్ఓ రజనికాంత్, గొల్లపెల్లి తహసీల్దార్ నవీన్, మార్కెట్ కమిటి చైర్మన్లు, ఇతర అధికారలు పాల్గోన్నారు.

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కోనుగోలు ప్రకీయ పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

Share This Post