రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలు సాగు చేయాలి వ్యాక్సిన్ వేగంగా చేపట్టి రెండవ డోస్ కు సమయం వచ్చిన వారికి స్వయంగా ఫోన్ చేసి వ్యాక్సినేషన్ చెప్పట్టాలి జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

ప్రచురణార్థం-1
జనగామ, డిసెంబరు 8:
రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని, రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని, వాక్సినేషన్ వేగంగా చెప్పట్టి రెండవ డోస్ కు సమయం వచ్చిన వారికి స్వయంగా ఫోన్ చేసి వాక్సినేషన్ చెప్పట్టలన్నారు జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య. బుధవారం కలెక్టర్ నర్మెంట, తరిగొప్పుల,బచ్చన్నపేట, మండలాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను, వాక్సినేషన్ ప్రక్రియను తనిఖీ చేసారు. వెల్దండ గ్రామంలో జరుగుతున్న కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసి, కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. యాసంగిలో లో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవు కావున రైతులు ఇంటి అవసరాల నిమిత్తం లేదా సీడ్స్ కంపెనికి గాని, రైస్ మిల్లులకు గాని నేరుగా అమ్మాలనుకునే వారు మాత్రమే వరి పంట వేసుకోవచ్చని ఆయన అన్నారు. ప్రత్యామ్నాయ పంటలు లాభసాటిగా వుంటాయని, రైతు సమూహాలతో గ్రామ స్థాయి సమావేశాలు ఏర్పాటుచేసి, పంట వైవిధ్యం పై వ్యవసాయ అధికారులు చైతన్యం చేస్తున్నప్పటికీ, రైతులకు తెలిసినంతగా ఎవరికీ తెలియవని అయినప్పటికీ అధికారులు ఎప్పటికప్పుడు మార్కెట్లో వచ్చే కొత్త వంగడాల గురించి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. రైతుల సందేహాల కోసం హెల్ప్ లైన్ నెంబర్ 72888 94712 కు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉంటారని ఫోన్ ద్వారా రైతులు వారి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగి వ్యాక్సిన్ వేస్తున్న ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. రెండవ డోస్ కు అర్హులైన వారికి వ్యాక్సిన్ వేయాలని కలెక్టర్ ఆదేశించారు. రెండవ డోసుకు అర్హత కలిగిన వారందరూ స్వచ్చందంగా వచ్చి వాక్సిన్ వేసుకోవాలన్నారు. వాక్సిన్ తీసుకున్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు. అజాగ్రత్తగా ఉంటే ప్రమాదానికి కారణం అవుతుందని అన్నారు. జన సమూహం అధికంగా ఉన్న చోట తప్పనిసరిగా బౌతిక దూరం పాటిస్తూ సానిటైజేషన్ చేసుకొని, మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు, డిఏఓ టి. రాధిక, డిఆర్డిఓ జి.రాంరెడ్డి, నర్మెట్ట, తరిగొప్పుల మండల ప్రత్యేక అధికారులు శ్రీపతి, రమేశ్, తహసిల్దార్లు వి,గంగాభవాని, ఎం.ఎ.ఫక్రుద్దిన్, శైలజ, తదితులున్నారు.

Share This Post