ప్రచురణార్థం
అబ్బాయి పాలెం, మరిపెడ.
మహబూబాబాద్ ,నవంబర్ .26
రైతులకు ఇబ్బంది లేకుండా తేమశాతం పరిశీలించిన తర్వాతనే కొనుగోళ్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు.
శనివారం మరిపెడ మండలంలోని అబ్బాయి పాలెం ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు.
ధాన్యం కొనుగోళ్లలో మార్గదర్శకాలను నిబంధనలను ఐకెపి సిబ్బందికి తెలియజేస్తూ రైతులకు ఇబ్బంది లేకుండా తేమశాతం పరిశీలించిన తర్వాతనే కొనుగోళ్లు చేపట్టాలన్నారు .
ప్రధానంగా మాయిచ్చర్ మీటర్ తో తేమశాతాన్ని పరిశీలించాలని , ప్యాడి క్లీనర్ తో ధాన్యాన్ని శుభ్రపరిచారా లేదా అన్నది కూడా పరిశీలించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు విద్యుత్ సరఫరా ఉండాలన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో గన్ని బ్యాగులు, హమాలీల సమస్యలు రాకుండా క్షేత్రాధికారులు నిరంతరం పర్యటిస్తూ చర్యలు తీసుకోవాలన్నారు ధాన్యం కాంటాలను కూడా ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలన్నారు. ధాన్యం శాంపిల్స్‌ను కవర్లలో భద్రపరచాలన్నారు
ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ సన్యాసయ్య , డిఎం సివిల్ సప్లై కృష్ణవేణి పౌర సరఫరాల అధికారి నర్సింగరావు తాసిల్దార్ రాంప్రసాద్ ఎంపీడీవో దన్ సింగ్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏ పి ఎం , సీసీ రైతులు తదితరులు పాల్గొన్నారు.