రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించేందుకు 5 వందల మెట్రిక్ టన్నుల నిలువ సామర్ధ్యం కలిగిన గోదాములను నిర్మించుకోవడం జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.

ప్రచురణార్ధం

ఆగష్టు 13 ఖమ్మం:

రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించేందుకు 5 వందల మెట్రిక్ టన్నుల నిలువ సామర్ధ్యం కలిగిన గోదాములను నిర్మించుకోవడం జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో నాబార్డు స్పెషల్ రీ-ఫైనాన్స్ నిధులు రూ.31.58 లక్షలతో నిర్మించనున్న కొండాయిగూడెం సహకార సంఘం గోదాము, పి.ఏ.సి.యస్ కార్యాలయ భవనానికి ఇల్లెందు శాసనసభ్యులు బాణోతు హరిప్రియతో కలిసి మంత్రి శంఖుస్థాపన చేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పడిన నాటి నుండి మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రైతులను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. సాగునీరు, పంట పెట్టుబడి సాయం, రైతుభీమా, ఉచిత విద్యుత్తు వంటి సౌకర్యాలను కల్పించి వారికి ఆర్థికంగా చేయుతనిస్తున్నారని మంత్రి తెలిపారు. రైతులు తాము పండించిన పంటలను ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా వారి గ్రామాలలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దత్తు ధరకు కొనుగోలు చేయడం జరిగిందన్నారు.

కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డి.సి.సి.బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, గ్రామ సర్పంచ్ దుర్గజ్యోతి, సోసైటీ చైర్మన్లు దనియాకుల హన్మంతరావు, తీర్ధాల చిదంబరరావు, తహశీల్దారు ధారా ప్రసాద్, ఎం.పి.డి.ఓ సీలార్ సాహెబ్, మిషన్ భగీరథ ఇ.ఇ. పుష్పలత, వ్యవసాయ శాఖ ఏ.డి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సహకార శాఖ అధికారి కె.విజయకుమారి, ఎం.పి.పి. బాణోతు సునిత స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post