రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యా కొనుగోలు ప్రక్రియను  వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యా కొనుగోలు ప్రక్రియను  వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు.

సోమవారం నాడు కలెక్టర్ కలెక్ట రేట్ మినీ  సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లు, పౌరసరఫరాల శాఖ సిబ్బంది తో వరి ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాన కాలంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయుటకు జిల్లాలో 144 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు . జిల్లాలో ఇంత వరకు ౩472 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో గన్ని బ్యాగులకు కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుండి లారీల ద్వారా కేటాయించిన మిల్లులకు పంపించిన ధాన్యాన్ని సంబంధిత రైస్ మిల్లర్లు వెంటనే దించు (అన్ లోడు ) కోవాలని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా రైస్ మిల్లర్లు సహకరించాలని ఆయన కోరారు.
రవాణా శాఖా అధికారులు, తిగినన్ని వాహనాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతులు ఆరబెట్టి శుభ్రం చేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి కనీస మద్దతు ధర పొందాలని ఆయన సూచించారు.  రైతులకు ధాన్యం నాణ్యత ప్రమాణాల  పై  అధికారులు అవగాహన కల్పిస్తున్నారని,     రైతులు సదరు నాణ్యతనలు పాటిస్తు  తీసుకువచ్చిన ధాన్యాన్ని వెంటనే  కొనుగొలు చేస్తామని  కలెక్టర్ స్పష్టం చేసారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంద్యారాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ కుమార్, జిల్లా సివిల్ సప్లయిస్ అధికారిణి వసంతలక్ష్మి,  జిల్లా మేనేజర్  సివిల్ సప్లయిస్ అధికారిణి కృష్ణవేణి, జిల్లా కో ఆపరేటివ్ శాఖాధికారి నాగేశ్వర రావు, డి టి సి పరుశ రాములు, ఎల్ డి ఎం మురిళిమోహన్ రావు , మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు, గన్ని బ్యాగుల సప్లయిర్స్, ట్రాన్ పోర్ట్ కాంట్రాక్టర్లు  తదితరులు పాల్గొన్నారు.

Share This Post