ప్రెస్ రిలీజ్
జనగామ జిల్లా, మే 20, శనివారం
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం
ప్రభుత్వానికి – ప్రజలకు వారధిగా ప్రభుత్వాధికారులు ఉండాలి….. జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య
జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామన్నారు జిల్లా కలెక్టర్.శివలింగయ్య,
శనివారం నాడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ పాగాల సంపత్ రెడ్డి, అధ్యక్షతన జరిగింది, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శివలింగయ్య హాజరయ్యారు,
ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ పాగాల సంపత్ రెడ్డి, మాట్లాడుతూ ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయుటకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిన నేపథ్యంలో రైతుల నుండి ప్రతి గింజలు కొనుగోలు చేస్తామన్నారు, పంట నష్టం పై వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగిందని జిల్లా పరిషత్ సభ్యులకు అధికారులు అందుబాటులో ఉంటూ వారి పర్యటన సమయాల్లో సమాచారం అందించాలని సూచించారు గ్రామస్థాయిలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో సమన్వయంతో పని చేయాలని ఆయన తెలిపారు,
జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య, మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ వ్యూహం ద్వారా ముందుకు వెళ్లామని ప్రత్యేక బృందాలు నియమించి ప్రతిరోజు టెలీ కాన్ఫరెన్స్ లు, సమావేశాలు రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తున్నామని వారం రోజుల్లో పూర్తి లక్ష్యం చేరేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు,
జిల్లాలో అన్ని విభాగాల ద్వారా జరిగే అభివృద్ధి పనులు సమయానుకూలంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవలు అందించాలని సంబంధిత అధికారులు అందరికి ఆదేశాలు ఇచ్చామన్నారు,
ఈ సందర్భంగా జిల్లా పరిషత్తు సభ్యులు లేవనెత్తిన అంశాలకు శాఖల వారీగా అధికారులు సమాధానం ఇచ్చారు, పెండింగ్లో ఉన్న అంశాలను వెంటనే పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు,
గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనుల కోసం వెళ్లి జిల్లా అధికారులు సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారుల ద్వారా స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం అందించాలని సూచించారు,
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ జడ్పీ సీఈఓ ఎన్.వసంత, జిల్లా పరిషత్ సభ్యులు, అన్ని విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు.