ప్రచురునార్ధం
వరంగల్
శనివారం
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు జరగాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు
2023 యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ కు సంబందించి సంబంధిత అధికారులతో శనివారం కలెక్టర్ సమావేశాన్ని ఏర్పాటు చేసారు
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో pacs, ikp, fpo, మెప్మా వారి ఆధ్వర్యంలో 197 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని… ఏ రోజుకు ఆరోజు ధాన్యం సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని అన్నారు
జిల్లాలో ట్యాగింగ్ అయిన 51 రైస్ మిల్లుల యాజమాన్యం వారు… మిల్లుల సామర్ధ్యం ను బట్టి ధాన్యం ను.. వారి మిల్లులకు పంపించుకోవాలన్నారు
ఒకవేళ వారి రైస్ మిల్లు ల సామర్ధ్యం సరిపోక పోతే … వేరే గోదాము లను అద్దెకు తీసుకోని ధాన్యంను దింపుకోవాలన్నారు
ఈ విషయం లో సివిల్ సప్ప్లై అధికారులు కో ఆర్డినేట్ చేసుకొని సమస్య లు రాకుండా చూసుకోవాలన్నారు
రైస్ మిల్లులకి సమయనుకూలంగా ధాన్యం తరలించే విషయం లో
సెంటర్ ఇంచార్జ్ లు, ఏజెన్సీ హెడ్, తహసీల్దార్ లు ఎప్పటికప్పుడు మానటరింగ్ చేయాలన్నారు
రైతులు తెచ్చే ధాన్యం విషయం లో నాణ్యత, పరిమాణం లాంటి అంశాలలో ధాన్యం కొనుగోలు నిర్వాహకులు పక్కాగా వ్యవహారించాలని….
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దనే రైతుల ధాన్యం కొనాలని…. ఎవరూ రైతులను డైరెక్ట్ గా మిల్లుల వద్దకు పంపించకూడదన్నారు
మిల్లుల వద్ద ధాన్యం ను దింపే హమాలీలు,FCI కి ధాన్యం పంపించే హమాలీలు వేరు వేరుగా ఉండాలని… అవసరమైతే హమాలీలు 2, 3 షిఫ్ట్ లు పని చేసే విధంగా మిల్లర్లు పెట్టుకోవాలన్నారు
మండలాల వారీగా నియమించిన స్పెషల్ టీం సభ్యులు ధాన్యం కొనుగోలు సత్వరంగా జరిగేలా పర్యవేక్షించాలన్నారు
ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ శ్రీ వాత్స, సివిల్ సప్ప్లై DM, DRDo, Jd అగ్రికల్చర్, DCO తదితరులు పాల్గొన్నారు