రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు కొనుగోలు కేంద్రం ఇంచార్జి లకు ఆదేశించారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు కొనుగోలు కేంద్రం ఇంచార్జి లకు ఆదేశించారు.

శనివారం కలెక్టర్ ఆకస్మికంగా కంది గ్రామం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ధాన్యం కొనుగోళ్ళ విషయమై ఆక్కడ ఉన్న రైతులతో ఆరా తీశారు. కొనుగోలు కేంద్రం ఇన్చార్జిలు ట్యాబ్ లో నమోదు చేస్తున్న వివరాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే తూకం చేసి, వెంటనే మిల్లులకు పంపాలన్నారు. సంబంధిత వివరాలను ట్యాబ్ లో నమోదు చేయాలని సూచించారు. మిల్లర్లు వచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే దింపుకొని రసీదులు ఇవ్వాలని సూచించారు.

ట్యాబ్ ఎంట్రీ, తూకం చేయడంలో జాప్యం చేయరాదన్నారు. జాప్యం చేసినట్లయితే సంబంధిత ఇన్చార్జి లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 72 గంటల్లో చెల్లింపులు జరగాలని తెలిపారు.

రానున్న రెండు రోజుల్లో వర్షాలు ఉన్నందున, రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావద్దన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి పోకుండా రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తో పాటు తాడి పత్రీ/టార్పాలిన్ కవర్లను తెచ్చుకోవాలని సూచించారు.

రైతులు ఎలాంటి అపోహలు, భయాందోళనలకు గురి కావద్దన్నారు. కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఎంపీడీవో, డిప్యూటీ తహసీల్దార్, కొనుగోలు కేంద్రం ఇన్చార్జిలు, రైతులు ఉన్నారు.

Share This Post