రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి …. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ప్రచురణార్ధం
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి …. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

మహబూబాబాద్, జూలై-31:

రైతు భిమా, కల్తీ విత్తనాలు, జలశక్తి అభియాన్, రైతు కళ్ళాలు, తదితర అంశాలపై  శనివారం కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్ ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులతో  కలెక్టర్ సమిక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మండలాల వారీగా అర్హత కలిగిన రైతులు, అర్హత కలిగి మరణించిన రైతులకు రైతు భీమా ఇన్సూరెన్స్ అందిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇన్సూరెన్స్ క్లెయిమ్ లు త్వరగా అందేటట్లు, ఏ ఒక్క లబ్దిదారుడు మిగలకుండా చూడాలని తెలిపారు.

రైతులు కల్తీ విత్తనాల వలన తీవ్రంగా నష్టపోతారని, కల్తి విత్తనాలపై వెంటనే చర్యలు తీసుకొని కేసులు పెట్టాలని ఆదేశించారు.  మండలాల వారీగా ఎంత మందిపై కల్తీ విత్తనాలు ఇచ్చినందుకు కేసులు పెట్టడం జరిగిందని అడిగి తెలుసుకున్నారు.  రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని, విత్తన దుకాణాలపై తనిఖీలు నిర్వహించాలని తెలిపారు.

రైతులకు జలశక్తి అభియాన్ పై అవగాహన కల్పించాలని, వ్యవసాయంలో నీటి ఆదా గురించి తెలపాలని సూచించారు.  రైతు కళ్ళాలు గురించి రైతులకు అవగాహన కల్పించి ఎక్కువ మంది రైతులు ఈ పథకాన్ని ఉపయోగించుకునే విధంగా చూడాలని, నూతన రైతులను గుర్తించి రైతు కళ్ళాల సంఖ్యను పెంచాలన్నారు.  ఇంతకు ముందు నిర్మించిన అన్ని రైతు కళ్ళాలకు చెల్లింపులు చేయడం జరిగిందని, ఎక్కువ మందిని గుర్తించాలని తెలిపారు.  రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఎక్కువగా తయారు చేసే విధంగా రైతులను ప్రోత్సహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు లక్ష్మీనారాయణ వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
—————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయడమైనది.

Share This Post