రైతులకు పెట్టుబడి అందిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రభుత్వానికి రైతుబంధు వారోత్సవాల ద్వారా కృతజ్ఞత తెలియజేయాలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ కుమార్

రైతులకు పెట్టుబడి అందిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రభుత్వానికి రైతుబంధు వారోత్సవాల ద్వారా కృతజ్ఞత తెలిజేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ ఉదయ కుమార్ గారు తెలిపారు.

 

ఈనెల 4వ తారీఖు నుండి 10వ  తారీఖు వరకు రైతుబంధు వారోత్సవాలు గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల స్ఘాయిలో ఘనంగా నిర్వహించాలని కోరారు.

 

జిల్లాలో యాసంగి 2021-22 కి గాను 2.9 లక్షల మంది రైతులకు రూ.376 కోట్లు మంజూరైంది. నేటి వరకు 2.22 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ. 202 కోట్లు జమ చేయబడినది. మిగతా 68 వేల మంది రైతులకు రూ.174 కోట్లు తొందర్లోనే జమ చేయబడతాయి.

 

ప్రభుత్వం రైతులకు ప్రతి సీజను లో పెట్టుబడి సాయం అందించి, వారిని అప్పుల బారి నుండి కాపాడుతోంది. రైతులకు పంట కాలం లో సాయం అందించి, పంట యాజమాన్య పద్ధతులు సకాలంలో చేసుకుని అధిక దిగుబడులు పొందేలా తద్వారా వారి ఆదాయం గణనీయంగా పెరిగేలా ఈ ప్రభుత్వం కృషి చేస్తోంది.

 

రైతుబంధు ద్వారా రైతుల జీవితాలలో వెలుగులు నింపిన ఈ ప్రభుత్వానికి రైతుబంధు వారోత్సవాల ద్వారా రైతులు తమ అభిమానం తెలిజేయాలని కలెక్టర్ కోరారు.

 

ఈనెల 4 నుండి 10 వ తారీఖు వరకు జరిగే రైతుబంధు వారోత్సవాలలో రైతులు, రైతుబంధు సమితి సభ్యులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ గారు కోరారు.

Share This Post