రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి : జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య

రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి : జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య

*ప్రచురణార్ధం-2*
జనగామ,నవంబర్,26:
రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య అన్నారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రత్యామ్నాయ పంటలపై బుక్ లెట్, గోడ పత్రికను ఆవిష్కరించిన సందర్భంలో ఆయన మాట్లాడుతూ మండల వ్యవసాయ అధికారులు గ్రామాలలో పంటల సాగుపై పక్కా ప్రణాళిక ప్రకారం (బుక్లెట్, గోడ పత్రిక) ద్వారా రైతులకు యాసంగి సీజన్ లో ప్రత్యామ్నాయ పంటలు శనగ, వేరుశనగ, పొద్దు తిరుగుడు, నువ్వులు, పెసర తదితర పన్నెండు రకాల పంటలు పండించేలా అవగాహన కల్పించి చైతన్య పరచాలన్నారు.
ఈ పంటలు పండిoచేందుకు అందుబాటులో ఉన్న విత్తనాల గురించి రైతులకు మండల ప్రత్యేక అధికారులు,ఏఈఓలు,సంబంధిత సిబ్బంది చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఏఓ.టి.రాధిక, ఆర్డీఓ లు మధుమోహన్, కృష్ణవేణి, జెడ్పీ సీఈఓ ఎల్. విజయలక్ష్మీ, ఉద్యానవన అధికారిణి కె.ఆర్.లత, డీఆర్డీఓ జి. రాంరెడ్డి, మండల ప్రత్యేక అధికారులు,
ఏఈఓ లు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post