రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి ….

ప్రచురణార్ధం

రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి ….

మహబూబాబాద్, డిసెంబర్-09:

రైతులను వరిపంట వేయనీయరాదని ప్రత్యామ్నాయ పంటలపై, అధిక లాభాలు వచ్చేపంటలను చేపట్టే విధంగా అధికారులు, అవగాహన కల్పించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథొడ్ అధికారులను ఆదేశించారు.

గురువారం జిల్లా కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో కలెక్టర్ శశాంక అధ్యక్షతన మంత్రి వైద్య కళాశాల నిర్మాణ పనులు, ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు నిర్మాణ పనులు, వ్యాక్సినేషన్, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మెడికల్ కళాశాలకు సంబందించి నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. వంద శాతం వాక్సినేషన్ కు చర్యలు తీసుకోవాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు వేగవంతం గా చేపట్టాలని, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించి రైతులు లాభ పడే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లాలో పోడు దరఖాస్తుల లబ్దిదారులకు లబ్ది చేకూర్చ లని అన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో 150 అదనపు బెడ్స్ సౌకర్యం కొరకు పనులు చేపట్టగా సెకండ్ ఫ్లోర్ పూర్తి అయిందని, మూడవ అంతస్తు పనులు నడుస్తున్నాయి అని, ఈ నెల 28లోగా పనులు పూర్తిచేస్తామని మంత్రి కి సంభందిత అధికారులు తెలపగా, పనుల ప్రగతిపై ఎప్పటికప్పుడు ఫోటోలు పంపాలని జిల్లా కలెక్టరు కోరారు.

మొదటి డోస్ వ్యాక్సినేషన్ లో 173 sub centres , 20 phc lalo 96.2 percent కు కంప్లీట్ చేసుకొని టాప్ టెన్ లో ఉన్నామని, రెండవ డోస్ లో కూడా 56 శాతం మందిలో 90 శాతం పూర్తి చేసుకున్నామని, రాష్ట్రాల్లో టాప్ టెన్ లో ఉన్నామని, ఇదేవిధంగా వంద శాతం ప్రగతి సాధించడానికి కృషి చేస్తున్నామని, ట్రైబల్ ఏరియా లో కోమట్లగుడెం, గంగారం మండలాలలో 100 శాతం వాక్సినేషన్ పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు.anm, ఆశ వర్కర్స్, మునిసిపల్ సిబ్బంది, ఇతర అధికారులు అందరూ కలిసి కట్టుగా ఓటరు లిస్ట్ ప్రకారం వాక్సినేషన్ కార్యక్రమం చేపట్టామని DMHO, కలెక్టర్ మంత్రికి వివరించారు.

భవిష్యత్తులో కరోనా కేసు లు వస్తే ధీటుగా ఎదుర్కొనుటకు ఇన్ పేషంట్ సౌకర్యం పెంచాలని, ఇప్పటికే మెడికల్ కళాశాల కు సంభందించి డాక్టర్ లు ఉన్నందున మిగతా ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి సూచించారు.

కిడ్నీ, డయాలిసిస్, HBS పేషంట్ లకు ట్రీట్మెంట్ కొరకు వేరే ప్రాంతాలకు వెళ్లకుండా, స్పెషలిస్ట్ డాక్టర్ లు ఉన్నందున స్థానికంగా వైద్య సౌకర్యం అందించుటకు కావాల్సిన సౌకర్యాలపై ప్రతిపాదనలు సమర్పించాలని వైద్య అధికారులను మంత్రి ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తున్న ధాన్యం వివరాలను అధికారులు వివరిస్తూ 235 కేంద్రాలు ఏర్పాటు చేసి 16 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ మంత్రికి వివరించారు.

వ్యవసాయ అధికారి చత్రు నాయక్ నివేదిస్తూ, వాతావరణం అనుకూలించక, తామర పువ్వు తో మిర్చి పంటకు కొంత నష్టం వచ్చిందని పంట నష్ట పోకుండా ఉండేందుకు మండలాల్లో పర్యటించి రైతులకు అవగాహన కల్పిస్తున్నామని, పంటను అన్ని జాగ్రత్తలు తీసుకొని పంట దిగుబడి ఎక్కువగా వచ్చే విధంగా కృషి చేస్తున్నామని వివరణ ఇచ్చారు.

ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ, మెడికల్ కళాశాలను పూర్తి చేసుకుంటామని, ఇంజనీర్ అధికారులు భవన ప్లాన్ ను మంచిగా రూపొందించి ఇతరులు అట్టి మోడల్ ను అనుసరించే విధంగా ఉండాలని, ఆసుపత్రిలో నిర్మించే extension పనులు నాణ్యతగా చేపట్టాలని, అధికారులు శ్రద్ధ వహించి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులూ రాకుండా చూడాలన్నారు. అలాగే జిల్లాలో ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని, ప్రభుత్వ భూముల ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
పోడు భూముల సమస్యను మంత్రి దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలని కోరారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ లు జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ సమస్యలను పరిష్కరిస్తున్నరని, అధికారులు కూడా తమ పరిధిలో సమస్యలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని కోరారు.

అనంతరం WE HUB ప్రతినిధి దీప్తి మాట్లాడుతూ, వ్యాపార రంగాలలో సాధికారత సాధిస్తున్న మహిళల గాధలు వీడియో ల ద్వారా చూపించి ఆసక్తి ఉన్న ఎస్.హెచ్.జి. మహిళలను ప్రోత్సహిస్తే విజయాలను సాధిస్తారన్నారు. . మహిళలకు స్వయం ఉపాధి కల్పించుటకు అవగాహనతో పాటు శిక్షణకు అందిస్తే ఆర్ధికంగా అభివృధి సాధించే విధంగా తీర్చుదిద్దేదుకు సహాయ పడతామని, గృహిణి లతో పాటు, విద్యార్ధినుల చదువు అనంతరం శిక్షణ కల్పించి పారిశ్రామిక వేత్తలు గా అవకాశం కల్పించి ఉత్పత్తి చేసిన వాటికి మార్కెటింగ్ కు సహాయ పడతామని మంత్రి దృష్ఠికి తీసుకొచ్చారు.

పార్లమెంట్ సభ్యురాలు ….మాలోత్ కవిత మాట్లాడుతూ
మారుమూల ప్రాంతాల్లోని మహిళలకు WE HUB ద్వారా సమన్వయం కల్పించి, జిల్లా అధికార యంత్రాంగం మారు మూల ప్రాంతాల మహిళలకు అవగాహన కల్పించి వారి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. యసంగి పంట మార్పిడి చేయాలని అధికారులు రైతులకు వివరించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు అభిలాష అభినవ్, డి. కొమరయ్య, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రాంమోహన్ రెడ్డి,ఆర్ అండ్ బి EE -తానేశ్వర్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి. హరీశ్ రాజ్, DChs వెంకట రమణ,డి.ఎస్.ఓ. నర్సింగ రావు, డి.సి.ఓ.ఖుర్షీద్, DRDO సన్యాసయ్య, అధికారులు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
—————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయ నైనది.

Share This Post