రైతులు అధైర్యపడవద్దు వానకాలంలో పండిన వరి ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తాం. జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్

 

రైతులు అధైర్యపడవద్దు

వానకాలంలో పండిన వరి ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తాం.

జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్
00000

జిల్లాలో వానకాలంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని మొత్తము కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడవద్దు అని జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

రైతులు తమ ధాన్యం వర్షానికి తడవకుండా టార్పాలిన్ కప్పి తడవకుండా రక్షించుకోవాలని సూచించారు. తడిసిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే వెంటనే కొనుగోలు చేస్తామని ఆయన తెలిపారు . రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో లేదో అని ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని తప్పకుండా రైతులు పండించిన ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేస్తామని ఆయన తెలిపారు 

 

Share This Post