రైతులు అధైర్య పడవద్దు, ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంది

రైతులు అధైర్య పడవద్దు, ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంది

 

వర్షాల వల్ల పంట నష్టపోయిన ప్రతి ఎకరానికి 10000 రూపాయలు చొప్పున చెల్లిస్తాం

 

రైతులతో పాటు కౌలు రైతులను కూడా ఆదుకుంటం

 

రైతు బంధు, రైతు బీమా, ఉచితంగా 24 గంటల విద్యుత్తు దేశంలో ఎక్కడా లేదు

 

పాత నీటి తీరువ  బకాయిలు మాఫీచేశాం

 

రాష్ట్రంలో బ్రహ్మాండంగా వ్యవసాయం – అద్భుతమైన పంటలు- మంచి లాభాలు

 

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు

 

000000

 

 

     అకాల వర్షాలు, వడగండ్ల వానల వల్ల పంట నష్టపోయిన రైతులు ఆత్మస్థైర్యం కోల్పో వద్దని, అధైర్య పడోద్దని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు.

 

     గురువారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హెలికాప్టర్ ద్వారా చేరుకోగా మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక  సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, దాసరి మనోహర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ముఖ్యమంత్రి కి ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి అకాల వర్షాలతో మస్క్ మిలన్, డ్రాగన్ ఫ్రూట్ పంటలను నష్టపోయిన ముస్కు రామచంద్రారెడ్డిని,  బండ శంకరయ్య వరి పొలం, పంట పొలాలను పరిశీలించి నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులతో పాటు, కౌలు రైతులను సైతం ఆదుకోవడం జరుగుతుందని ముఖ్యమంత్రి ఈ సందర్బంగా హామీ ఇచ్చారు.

 

     అనంతరం రామడుగు మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పాల్గోని మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల రాష్ట్రంలోని అనేక జిల్లాలలో దాదాపుగా రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల 25 వేల 258 ఎకరాలలో ఎకరాలలో మొక్కజొన్న, మామిడి, వాటర్ మిలన్ తదితర పంటలకు నష్టం జరిగిందన్నారు. పంటను నష్టపోయిన రైతులకు దేశ చరిత్రలోనే మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ప్రతి ఎకరానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందన్నారు. రైతులతో పాటు కౌలు రైతులకు కూడా సహాయం అందించనున్నట్టు తెలిపారు. ఒకప్పుడు వలసలకు పోయిన రైతులను వెనకకు తెప్పించేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి, రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్న ప్రభుత్వం తెలంగాణ మాత్రమే నని తెలిపారు. కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణ సమయంలో గాయత్రి పంప్ హౌజ్ పరివాహాక ప్రాంతాల్లో సరైన పంటపోలాలు కనిపించక పోయెవని,  ఫ్లడ్ ప్లో కేనాల్ రిజర్వాయర్ గా మారడంతో సమృద్దిగా నీటి నిలువలు, భూగర్బజలాలు పెరిగి,  అద్భుతమైన పంటలతో రైతులు లాభాలు అర్జించారని అన్నారు. వంట నష్టపోయిన రైతులను కలసినప్పుడు అకాల వర్షంతో సంభవించిన నష్టాన్ని తట్టుకుంటామని రైతులు చెప్పడం ఒకింత సంతోషాన్ని కలిగించిందని ముఖ్యమంత్రి తెలిపారు.  రాష్ట్రంలో బ్రహ్మాండంగా వ్యవసాయం జరుగుతుందని 84 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని, భారతదేశంలో మొత్తం పండించిన పంటలు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే పండుతున్నాయని తెలిపారు. 56 లక్షల ఎకరాల్లో వరి, 22 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు( మిర్చి, కూరగాయలు) పండిస్తున్నారని, రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని తెలిపారు.

 

    ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యమంత్రి కార్యాలయ ఓ ఎస్ డి స్మితా సబర్వాల్, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పల్ల రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, చొప్పదండి, పెద్దపల్లి ఎమ్మెల్యేలు సుంకే రవి శంకర్, దాసరి మనోహర్ రెడ్డి, నగర మేయర్ వై సునీల్ రావు, జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, పోలీస్ కమీషనర్ సుబ్బారాయుడు, జిల్లా గ్రంధాలయం చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, సుడా చైర్మన్ జివి రామకృష్ణారావు, జిల్లా అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, జి.వి. శ్యాం ప్రసాద్ లాల్, ట్రైని కలెక్టర్ లెనిన్ వాత్సల్ టోప్పో, జడ్పీ సీఈఓ ప్రియాంక, ఆర్డిఓలు ఆనంద్ కుమార్, హరిసింగ్, కార్పొరేటర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post