రైతులు… అప్రమత్తం గా ఉండాలి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

Press reles

11మే 2022
హనుమకొండ

రైతులు… అప్రమత్తం గా ఉండాలి
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

అసని తుఫాన్ ప్రభావంవాళ్ల జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఎప్పుడైనా ఎక్కడైనా పడవచ్చనీ,ధాన్యం తడవకుండా రైతులు తగిన జాగ్రత్త లు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నీడొక ప్రకటనలో రైతులకు విజ్ఞప్తి చేసారు.

వర్షాలు వస్తున్నందున కల్లాలలో అరబోసిన ధాన్యం తడిసిపోకుండా పూర్తి స్థాయి లో పట్టాలు కప్పుకోవాలని వర్షాలు పూర్తిగా తగ్గేవరకు పట్టాలను తొలగించవద్దని సూచించారు.

రైతులు ధాన్యం తడవకుండా ఉండేందుకుగాను నివాసాల వద్ద తగిన జాగ్రత్తలను తీసుకోవాలని ఒక వేళ కొనుగొలు కేంద్రానికి తీసుకువచ్చినట్లయితే ధాన్యం రాశులపై తప్పనిసరిగా
టార్పాలిన్‌లు కప్పాలనీ ఆయన తెలిపారు.
జిల్లా అధికార యంత్రాంగం ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్థి నష్టం జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆయన అట్టి ప్రకటన లో వెల్లడించారు.

Share This Post