పత్రికా ప్రకటన తేది :29- 9- 2021
రైతులు ఆయిల్ పామ్ విజ్ఞాన యాత్ర లో ఆయిల్ పామ్ సాగు యొక్క శాస్త్రీయ పద్ధతులను నేర్చుకొని సాగు లో ఉపయోగించేలా అధికారులు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
బుధవారం కల్లెక్టరేట్ ఆవరణలో రైతుల ఆయిల్ పామ్ విజ్ఞాన యాత్రకు137 మంది రైతులతో బయలుదేరుతున్న 3 RTC బస్సులను జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు దరఖాస్తు చేసుకొని రైతు వాటా కూడా చెల్లించి, ఆయిల్ పామ్ సాగు చేయబోయే రైతులకు సాగు పై అవగాహన కొరకు ఖమ్మం జిల్లా లోని అశ్వారావుపేట కు నేడు మొదటి విడతగా ఆయిల్ పామ్ విజ్ఞాన యాత్రను చేపట్టామని, ఆయిల్ పామ్ సాగు యొక్క పద్ధతులను, సాగులో ఉపయోగించే పరికరాలు, ఎరువులు మొదలగు వాటి గురించి క్షుణ్ణoగా తెలిసుకొని, ఏవైన సందేహాలు ఉంటే అక్కడే అధికారులతో తెలుసుకొని పూర్తి నివృత్తి చేసుకొని రావాలని రైతులకు సూచించారు.
జిల్లాలో నేటికి 756 ఎకరాల్లో సాగుకు రైతులు దరఖాస్తులు చేసుకున్నారని, మిగిలిన 746 ఎకరాలకు ఆయిల్ పామ్ సాగు చేయాలనుకునే వారు తమ ప్రాంతీయ వ్యవసాయ విస్తరణ అధికారి, ఉద్యానవన అధికారి, ఆయిల్ ఫెడ్ అధికారి ద్వారా అక్టోబర్ నెలలోగా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. రైతు వాటా గా చెల్లించాల్సిన మొక్కకు రూ.33. చొప్పున.(ఎకరాకు 57 మొక్కల చొప్పున) తాము సాగుచేయదాలచిన మొక్కలకు చెల్లించి తమ పేర్లు నమోదుచేసుకోవాలని తెలిపారు. ఆయిల్ పామ్ సాగుకు దరఖాస్తు చేసుకొని, రైతు వాటా కూడా చెల్లించిన రైతులను ఆయిల్ పామ్ సాగు చేస్తున్న ఖమ్మం జిల్లా లోని అశ్వారావుపేట కు విజ్ఞాన యాత్రకు తీసుకొని వెళ్లి అక్కడ సాగు చేస్తున్న రైతులతో , శాస్త్ర వేత్తలతో అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు.
ఉద్యాన వన శాఖ అధికారి సురేష్, రైతుల తోపాటుగా 63 మంది అలంపూర్ డివిజన్ వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు , సహాయ వ్యవసాయ సంచాలకులు ఈ యాత్రలో పాల్గొన్నారు.
———————————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే జారీ చేయడమైనది.