రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి : జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

జిల్లాలోని రైతులు వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్‌ రైతు వేదికలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ యాసంగిలో సాగు చేసే వరిధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేయదని, వరికి ప్రత్యామ్నాయంగా పప్పు దినుసులు, నూనె గింజలు, చిరుధాన్యాలు తదితర పంటలను రైతులు సాగు చేయాలని, రైస్‌మిల్లర్లతో ముందస్తు ఒప్పందం ఉన్న రైతులు మాత్రమే వరి సాగు చేసుకోవచ్చని తెలిపారు. జిల్లాలోని మారుమూల గ్రామాల నుండి క్షేత స్థాయిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని, అవగాహన సదస్సు ఫొటోలను పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి రోజు 4 లేదా 5 గ్రామాలలో రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏ.డి.ఎ. (టి) వెంకటి, కాగజ్‌నగర్‌ ఏ.డి.ఎ. (ఆర్‌ మనోహర్‌, ఆసిఫాబాద్‌ ఏ.డి.ఎ. (ఆర్‌)
మిలింద్‌ కుమార్‌, వ్యవసాయ విస్తరణాధికారులు, మండల వ్యవసాయ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post