ప్రచురణార్ధం
రైతులు ఆర్ధికంగా బలోపేతం అయ్యేందుకు అధికారులు కృషి చేయాలి…
మహబూబాబాద్, అక్టోబర్,5.
రైతులను పంటలపై అవగాహన పరుస్తూ ఆర్ధికంగా బలోపేత చేసేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.
మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆధ్వర్యంలో వ్యవసాయ సేద్యం పై పంటల నమోదు భూసార పరీక్షలు పంటల మార్పిడి రైతుబంధు రైతు బీమా లపై అధికారులతో సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ అధికారులకు మరింత సమన్వయం పెంచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి రైతు వేదికలు నిర్మించిందని రైతు వేదికల కార్యకలాపా లు చేపట్టాలని వ్యవసాయ విస్తరణ అధికారులను ఆదేశించింది అన్నారు.
పంట నమోదు లో వాస్తవం నివేదికలు రూపొందించా లన్నారు.
పంట రుణాలను మంజూరు చేయించుకోవటం లో కూడా వెనుకబడి ఉన్నామని అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
రైతు వేదికలు నిరంతరం పని చేస్తూ ఉండాలని అత్యధికంగా సమావేశాలు నిర్వహించాలని నిర్వహణ లోపాలు ఉంటే సరి చేసుకోవాలన్నారు .
జిల్లాలోని 82 రైతు వేదిక లు ఉండగా 68 రైతు వేదికలకు మిషన్ భగీరథ కనెక్షన్లు ఇప్పించడం జరిగింది అని 22 రైతు వేదికలకు కాంపౌండ్ వాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
రైతు వేదికలలో టాయిలెట్స్ విద్యుత్ నీటి సరఫరా వంటి లోపాలు ఉంటే వెంటనే సరి చేసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్, ఉద్యాన అధికారి సూర్యనారాయణ వ్యవసాయ సహాయ సంచాలకులు లక్ష్మీనారాయణ ఏ వో లు ఏ ఈ ఓ లు తదితరులు పాల్గొన్నారు
————————
జిల్లా పౌరసంబంధాల అధికారి మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది