రైతులు ఆలోచన దృక్పథం మార్చుకొని, భవిష్యత్తు లోవరి కి బదులుగా మార్కెట్ లో డిమాండ్ ఉన్న ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

పత్రిక ప్రకటన                                           తేది: 07-12-2021

రైతులు ఆలోచన దృక్పథం మార్చుకొని, భవిష్యత్తు లోవరి కి బదులుగా మార్కెట్ లో  డిమాండ్ ఉన్న ప్రత్యామ్నాయ పంటలు  వేసుకోవాలని  జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

మంగళవారం గద్వాల్ మండలం జమ్మిచేడు, ధరూర్ మండలం ఆల్వాల్ పాడు  గ్రామాలలోని వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. జమ్మిచేడు కొనుగోలు కేంద్రం లో  వ్యవసాయ అధికారుల ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన  “యాసంగి లో వరి కి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు అవగాహన సదస్సు” లో పాల్గొని రైతులకు ప్రత్యామ్నాయ పంటల పై అవగాహన కల్పించారు. యాసంగి లో ఎఫ్.సి.ఐ ద్వారా వరి  కొనుగోలు చేయనందున, యాసంగి లో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని, వరి వేసుకుంటే మీరే స్వంతంగా అమ్ముకోవలసి ఉంటుందని రైతులకు తెలిపారు. రైతులు వారి ప్రాంతానికి సరిపోయే పంటలను ఎంపిక చేసుకొని వాటిని పండించాలని, ఆరుతడి పంటలను పండిస్తే తక్కువ నీటితో ఎక్కువ పంట పండించోచ్చని, వ్యవసాయ అధికారుల సహకారం తో ప్రత్యామ్నాయ పంటలు, ఆరుతడి పంటల తెలుసుకొని వాటిని పండించాలని రైతులకు సూచించారు. ప్రభుత్వం యాసంగి లో వరి కొనుగోలు చేయదని, వరి కి బదులుగా లాబాలు వచ్చే ఇతర పంటలను పండించాలని, తక్కువ ఖర్చు తో ఎక్కువ దిగుబడి  వచ్చే పంటలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు. వ్యవసాయ అధికారులతో ఇతర పంటలకు సంబంధించిన సమాచారం తెలుసుకొని లాబాలు వచ్చే పంటల పై దృష్టి పెట్టి, వాటిని పండించడానికి ముందు గానే ప్రణాళిక రూపొందించుకోవాలని రైతులకు సూచించారు. తక్కువ కాలపరిమితి లో పండించే వేరు శనగ, నువ్వులు లాంటి తేలిక పంటలు , మినుములు, పెసర్లు, వంటి పంటలు పండిస్తే తక్కువ ఖర్చు తో అధిక లాబాలు పొందవచ్చని  అన్నారు.

ధరూర్ మండలం ఆల్వాల్ పాడు గ్రామం లోని వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. యాసంగి లో వరి పండించడం వల్ల  వచ్చే ఇబ్బందుల గురించి రైతులకు తెలియజేయాలని అధికారులకు ఆదేశించారు. భారత ఆహార సంస్థ వారు యాసంగి లో వరి కొనుగోలు చేయమని స్పష్టం చేసినందున , రాబోయే రోజుల్లో రైతులు జాగ్రత్త పడి వరికి బదులుగా ఇతర ప్రత్యమ్నాయ పంటలు వేసుకోవాలని, రైతులు ఆలోచన దృక్పథం మార్చుకొవాలని, భవిష్యత్తు లో మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలు పండించాలని రైతులకు సూచించారు. యాసంగి లో వరి వేస్తే రైతులు ఇబ్బందులు ఎదురుకొవలసి ఉంటుందని, రైతులకు ప్రత్యామ్నాయ పంటల పై అవగాహన కల్పించుటకు విస్త్రుత సమావేశాలు నిర్వహిస్తున్నామని, వ్యవసాయ శాఖ ద్వారా బుక్ లు కుడా పంచడం జరుగుతుందని  తెలిపారు. వ్యవసాయ అధికారులు రైతులకు ప్రత్యామ్నాయ, ఆరుతడి పంటల పై అవగాహన కల్పించాలని అన్నారు. రైతులు వరి పండించి ఇబ్బంది పడకుండా ముందే జాగ్రత్త పడి పప్పు, ఆయిల్ పామ్, మినుములు, వంటి లాబధయకమైన పంటలు వేసుకోవాలని, రైతులను కోరారు.

కార్యక్రమం లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్, జిల్లా వైద్యాధికారి చందు నాయక్, ఎడిఎ సక్రియ నాయక్, తహసిల్దార్ హరికృష్ణ, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చెన్నయ్య, ఎ.ఓ లు శ్రీ లత, సుచరిత, సర్పంచు వీరన్న గౌడ్, తదితరులు  పాల్గొన్నారు.

————————————————————————-

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ గారిచే జారి చేయనైనది.

Share This Post