*రైతులు ఋణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి:: ఇంచార్జ్ జిల్లా రెవిన్యూ అధికారి టి. శ్రీనివాస రావు*

*ప్రచురణార్థం-1.

రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 28: జిల్లాలోని రైతులు బ్యాంకులు అందించే ఋణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి టి. శ్రీనివాస రావు అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా రెవిన్యూ అధికారి అధ్యక్షతన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా ఋణ లక్ష్యం 2249.58 కోట్ల రూపాయలు కాగా ఇప్పటివరకు 2059.52 కోట్ల ఋణాలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. వ్యవసాయ రంగానికి 580.25 కోట్లు, వ్యవసాయ దీర్ఘకాలిక రంగాలకు 302 కోట్లు, సూక్ష్మ, స్థూల, మధ్య తరహా పరిశ్రమలకు 204 కోట్లు, ఇతర రంగాలకు 41.4 కోట్లు మంజూరు చేయడం జరిగిందని ఆయన అన్నారు. అప్రాధాన్యత రంగాలకు 1054.7 కోట్లు, మహిళా సంఘాలకు 266.33 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. వచ్చే సంవత్సరం వార్షిక ఋణ ప్రణాళిక క్రింద 2504.46 కోట్ల లక్ష్యం నిర్దేశించడం జరిగిందని అన్నారు. జిల్లాలో పీఎంఎఫ్ఎంఈ పథకం కింద 15 యూనిట్లను మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అనంతరం నాబార్డు రూపొందించిన ప్రాజెక్టు క్రెడిట్ ప్లాన్ 2022-23 పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మేనేజర్ ఉపేందర్ రావు, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ వినోద్ కుమార్, ఆర్బీఐ ఏజీఎం కె.ఆర్. ప్రసాద్, వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకు లింకేజీ అధికారులు, బ్యాంకుల మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post