వార్త ప్రచురణ:
ములుగు జిల్లా:
తేదీ:06-12-2021.(సోమవారం )
జిల్లా లో 170 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసి రైతులు పండించిన పంటను కొనుగోలు చేయుటకు రైతులు వారు పండించిన పంట కు గిట్టుబాటు ధర చేల్లించుటలో,తూకం లలో,మరే విధమైన సమస్యలు తలెత్తినట్లుఅయినను, సంబందిత అధికారులు రైతుల సమస్యలపై స్పందించనట్లు అయితే రైతులు కోసం ప్రత్యెక కంట్రోల్ రూం నెంబర్ 18004250520ను ఏర్పాటు చేయనైనదని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ కంట్రోల్ రూం నిర్వహణకు షిఫ్ట్ ల వారిగా సంబందిత శాఖ సిబ్బందికి విధులు కేటాయించి రైతుల సమస్యల పై 24 అందుబాటుల ఉంటుందని జిల్లా కలెక్టర్ అన్నారు.