రైతులు తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం వచ్చే పంటలను పండించాలి: జిల్లా కలెక్టర్ డి హరిచందన

రైతులు తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం వచ్చే పంటలను  పండించాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన

జిల్లా లోని రైతులు అందరూ ఒకే రకం పంటలు  పండించారాదని, తమ పొలం స్వభావాన్ని, మార్కెట్లో డిమాండు ఉన్న పంటలను సాగు చేసే విధంగా చూడాలని   కలెక్టర్ రైతులను సూచించారు. గురువారం ధన్వాడ మండల కేంద్రంలో పర్యటిస్తుండగా అక్కడే ప్రాథమిక సహకార సంఘం మహాజన సభ  జరుగుతుండగా  కలెక్టర్ రైతులనుద్దేశించి మాట్లాడారు.   రైతులు ఒకే రకమైన పంటలు వేయకుండా  ఆదాయం లభించే పంటలు వేయాలని సూచించారు. జిల్లా లో ఆయిల్ ఫార్మ్ తోటలను, నూనె గింజలను  పండించాలని సూచించారు. ఆయిల్ ఫామ్ పండిస్తే  ప్రభుత్వం నుండి  సబ్సిడీ అందజేయడం జరుగుతుందని తెలియజేసారు. తమ పోల లలో కల్ లాలను నిర్మించుకోవాలన్నారు.  సమావేశం కంటే ముందు నుతనంగా ఏర్పాటు చేసిన   గ్రామ పంచాయతి భవనాన్ని పరిచిలించి గ్రామ పంచాయతీ భవన ప్రాంగణం లో  ఇంకుడుగుంతను పరిశీలించారు. గ్రామా పంచాయతి ప్రాంగణం లో మొక్కలను నాటి ఎస్సి బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. వసతి గృహం లో మూత్రశాలలు మరుగుదొడ్లను పరిశీలించి భవనం పైనుంచి వచ్చే నీటిని ఇంకుడు గుంత ను పరిశీలించారు. గ్రామం లో  ప్రతి ఒక్క ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించేటట్లు చర్యలు చేపట్టాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఇంకుడు గుంతల వలన కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రభుత్వ భూమి ని సర్వే చేసి అక్రమంగా నిర్మాణాలను వెంటనే తొలగించి స్వాధీన పరుచుకోవాలని డిప్యూటి తహసిల్దార్ కు సూచించారు. అనంతరం ధన్వాడ మండలం లోని మంది పల్లి గ్రామం లో 10 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్న  బృహత్ పల్లె ప్రక్రుతివానాన్ని సందర్శించి వనం లో మొక్కను నాటారు. డంపింగ్ యార్డ్ ను పరిశీలించి పంచాయత్ సెక్రటరి పై  ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామం లో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించిన తరువాత చేయవలసిన పనుల అసంపూర్తిగా ఉండటం పై ఆగ్రహం వ్యక్తపరిచారు. వెంటనే చెత్తను వేరు చేసి ఎరువును తాయారు చేయాలనీ సూచించారు. నర్సరీ లో సూచిక బోర్డు ను ఏర్పాటుచేయాలన్నారు.

ఈ కార్యక్రమం లో డిఅర్దిఒ గోపాల్ నాయక్, మండల ప్రతేక అధికారి గోవింద రాజన్, ద్యుప్యుటి తహసిల్దార్, ఎంపిటిసి, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post