రైతులు తమ ఫోన్ నెంబర్ ఆధార్ తో తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలి…. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

 

రైతులు తమ ఫోన్ నెంబర్ ఆధార్ తో తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలి…. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ఓటీపీ నెంబర్ కోసం రైతులు తమ ఫోన్ ను తప్పనిసరిగా కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలనిజిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.

జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు 151 కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు.

రైతులు నాణ్యత ప్రమాణాలున్న ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొని వచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు.

కొనుగోలు కేంద్రాల్లోకి వచ్చిన ధాన్యానికి మాత్రమే గోనెసంచులు ఇస్తారని స్పష్టం చేశారు.

ధాన్యం కొనుగోలు సాఫ్ట్ వేర్ లో రైతుల ఆధార్ కార్డుకు లింకు ఐన ఫోన్ నెంబరుకు వచ్చే OTP నమోదు చేస్తేనే రైతు ధాన్యం కొనుగోలుకు అవకాశం ఉంటుందన్నారు.

ధాన్యం అమ్ముకునే రైతులకు ఆధార్ కార్డుకు లింకు అయిన ఫోన్ ను తీసుకొని కేంద్రానికి వచ్చేటట్లు అధికారులు ముందుగా తెలియచేసి అవగాహన కల్పించాలని సూచించారు.

ఆధార్ కార్డుకు ఫోన్ నెంబరు లింకు లేకపోయినా / ఫోన్ నెంబరు మారిపోయినా దగ్గరలోని ఆధార్ కేంద్రానికి వెల్లి ఆధార్ లో ఫోన్ నెంబరు మార్చుకొనవచ్చని తెలిపారు.

జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, PPC సిట్టింగ్ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు పర్యవేక్షక అధికార్లు రైతులకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు.

Share This Post