రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తూర్పారబట్టిన నాణ్యత ప్రమాణాలు కలిగిన ధాన్యాన్ని తేవాలని తద్వారా కనీస మద్దతు ధర లభించడంతో పాటు త్వరగా మిల్లులకు రవాణా జరుగుతుందని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు.

ప్రచురణార్ధం.

నవంబరు, 17, ఖమ్మం:

రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తూర్పారబట్టిన నాణ్యత ప్రమాణాలు కలిగిన ధాన్యాన్ని తేవాలని తద్వారా కనీస మద్దతు ధర లభించడంతో పాటు త్వరగా మిల్లులకు రవాణా జరుగుతుందని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. బుధవారం కూసుమంచి మండలం, చేగొమ్మ, పాలేరు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. చేగొమ్మలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల నుద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వానాకాలం పంట సీజన్లో సాగునీటి వసతి పుష్కలంగా ఉన్నందున వరిసాగు విస్తీర్ణం పెరిగి ధాన్యం దిగుబడి అధికంగా జరిగిందని వానాకాలం సీజన్కు సంబంధించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని కలెక్టర్ తెలిపారు. రైతులు ధాన్యాన్ని తూర్పారబట్టి, నాణ్యత ప్రమాణాలకనుగుణంగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన యెడల కనీస మద్దత్తు ధరతో పాటు త్వరగా మిలులకు రవాణా చేసే సౌలభ్యం ఉంటుందని కలెక్టర్ అన్నారు. తూర్పారపట్టకుండా.. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ధాన్యం తెచ్చే ఒక్క రైతువల్ల ఇతర రైతులపై దాని ప్రభావం పడుతుందని కలెక్టర్ అన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాలలో అవసరమైన గన్నీబ్యాగులను అందుబాటులో ఉంచామని, ప్రతి కొనుగోలు కేంద్రంలో టార్పాలిన్లను అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ తెలిపారు. రైతులందరూ కల్లాలను నిర్మించుకునే విధంగా వ్యవసాయ విస్తరణాధికారులు, ఎం.పి.డి.ఓల సమన్వయంతో సత్వర చర్యలు చేపట్టి నెలరోజుల లోపు రైతులందరూ కల్లాలు నిర్మించుకునేలా తగు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు.

అనంతరం పాలేరు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. పాఠశాల అప్ గ్రేడ్ అయి విద్యార్థుల సంఖ్య పెరిగినందున అదనపు రతగతి గదుల ఏర్పాటుకు స్థల కేటాయింపులకు ప్రతిపాదనలు సమర్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా గ్రామ పంచాయితీ. నర్సరీని కలెక్టర్ తణిఖీ చేసారు. నర్సరీని సక్రమంగా నిర్వహించాలని, పండ్లు, పూల మొక్కలతో పాటు కూరగాయల సాగును ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు.

జిల్లా సహకార శాఖాధికారి విజయకుమారి, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్, ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంద్రనాథ్, చేగొమ్మ పి.ఏ.సి. ఎస్ చైర్మన్ శేఖర్, తహశీల్దారు శీరీష, ఎం.పి.డి.ఓ కరుణాకర్ రెడ్డి, వివిధ పి.ఏ.సి.ఎస్ చైర్మన్లు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post