రైతులు నష్టపోకుండా పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి…. జిల్లా. కలెక్టర్ కె. శశాంక.

రైతులు నష్టపోకుండా పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి…. జిల్లా. కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

రైతులు నష్టపోకుండా పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి…. జిల్లా. కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్, ఏప్రిల్ -28:

రైతులు పండించిన ప్రతి గింజను రైతులు నష్టపోకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు.

గురువారం మధ్యాహ్నం స్థానిక గిరిజన భవనంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సిబ్బందికి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, అనుసరించాల్సిన విధి, విధానాలపై ఉన్నతాధికారులతో ఒకరోజు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ కె. శశాంక మాట్లాడుతూ, రైతులు పండించిన ప్రతి గింజకూడా నష్టపోకుండా కొనుగోలు సెంటర్లకు ధాన్యం వచ్చే విధంగా అధికారులు, సెంటర్ ఇన్చార్జులు రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చే నాణ్యమైన వడ్లను తీసుకొని రైతులకు సరైన గిట్టుబాటు ధర వచ్చేట్లు, వడ్లు మిల్లుల్లో కటింగ్ కాకుండా ఏలాంటి తేడా లేకుండా ప్రభుత్వం కల్పిస్తున్న గిట్టుబాటు ధర వచ్చేట్లు చూడాల్సిన ప్రధాన బాధ్యత కొనుగోలు సెంటర్ లదేనని కలెక్టర్ తెలిపారు.

పట్టా పాస్ బుక్కు ఉన్న రైతు పేరు మీదనే సెంటర్ కు వచ్చిన ధాన్యం కొనుగోలు చేసుకోవాలని, ఆధార్ కార్డు కు ఫోన్ నెంబర్ లింక్ తప్పని సరియని, సరైన నిర్వహణ లేని సెంటర్లను గుర్తించి సిబ్బందిని మార్చాలని, నాణ్యత ప్రమాణాలు పాటించిన ధాన్యం ప్రతి గింజను కొని రైతులు నష్టపోకుండా చూడాలని, కొనుగోలు కేంద్రాల ఇన్ చార్జీలు రాజకీయ ప్రయోజనాలకు, ఒత్తిళ్లకు లో లోనవ్వరాదని, అందరికీ సమాన న్యాయం అందించాలని, ధాన్యం లోడ్ అవ్వగానే రిసిప్ట్ కట్ చేయాలని, ట్రాక్ షీట్ తప్పనిసరని, ట్రాన్స్ పోర్టు ఖర్చులతో సహా ఆయా జిల్లా శాఖలే భరిస్తాయని వాటికి ఆయా శాఖలు రియంబర్స్మెంట్ చేయించుకోవాలని, సమస్యలు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వడ్ల కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలని ట్యాబ్ లో రైతు యొక్క వివరాలు నమోదు చేయాలని, ఓ పి ఎం ఎస్ లో రైతు డాక్యుమెంట్స్ లో వివరాలు ఉండేవిధంగా చూడాలని, మిల్లుల నుండి వచ్చిన ట్రక్ సీట్ ని నిర్వహణ వ్యక్తి నుండి తీసుకొవాలని, బ్యాంకు ఖాతా వివరాలను రైతువి మాత్రమే నమోదు చేయాలని, రైతు ధాన్యము అమ్మిన వారం రోజుల్లో తన ఖాతాలో డబ్బులు జమఅయ్యేట్లు ట్యాబ్ ఆపరేటర్లు చొరవ చూపాలని,RO తప్పనిసరియని, లేదంటే వచ్చే విధంగా చూడాలని తెలిపారు. అవసరం మేరకు గన్ని బ్యాగులు సమకూర్చుకోవాలని, మంచి నీటి వసతి, టాయిలెట్ సౌకర్యం, విశాలంగా టెంట్లు, కుర్చీలు వేయించాలని మెడికల్ టీము రోజు వచ్చే ట్ల తగు చర్యలు చేపట్టాలని, వాటర్ ప్యాకెట్లను అందుబాట్ లో ఉంచుతూ రైతులు వడదెబ్బకు గురికాకుండా, పలుమార్లు సెంటర్లకు వచ్చేట్లు వారిని ఇబ్బంది పెట్టకూడదని మీరు చేపట్టాల్సిన చర్యలు, అన్ని జాగ్రత్తలు పాటించి రభీ, యాసంగి 2022 ను విజయవంతంగా నిర్వహించాలని శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా కలెక్టర్ డేవిడ్, డి సి ఓ సయ్యద్ ఖుర్షీద్, డి ఎం మహేందర్, డీఏవో చత్రు నాయక్, డీఎస్ఓ నర్సింగరావు, వివిధ మండలాల ఏవోలు, ఏ ఈ ఓ లు, సహకార సంఘాల సీఈఓ లు, సెంటర్ ఇన్చార్జిలు, ట్యాబ్ ఆపరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

———————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post