రైతులు నాణ్యత ప్రమాణాల ప్రకారం వారి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకోవస్తే మద్దతు ధర లభిస్తుంది.. జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్.

ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమణికంగా నిలిచిందని, రైతును రాజుగా చేయాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ద్వారా రైతులు పండించిన వారి ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ తెలిపారు.
ఈరోజు కలెక్టర్ కార్యాలయం లోని తన ఛాంబర్లో వారి ధాన్యం కొనుగోలుపై పౌర సరఫరాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, వారి ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాలుకు గ్రేడ్ – A రకానికి రూ. 1960/-, సాధారణ రకానికి రూ. 1940/- లభిస్తుందని తెలిపారు. ఇట్టి ధర లభించాలంటే రైతులు పలు జాగ్రత్తలు వహించాలన్నారు. ధాన్యం అమ్మకానికి తెచ్చే ముందు తాలు గింజలు, కల్తీ గింజలు, పొల్లు లేకుండా తెచ్చినట్లయితే ఆశించిన ధర లభిస్తుందన్నారు. తేమ శాంతం ఖచ్చితంగా 17 శాంతం లోపు ఉండేటట్లుగా చేసి మీ టోకెన్ ప్రకారం కేటాయించిన రోజు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొని రవాలన్నారు. ధాన్యం తూకం వేసిన తరువాత రైతులు విధిగా కొనుగోలు రసీదు పొందాలన్నారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించే సమయంలో మీ ఫోనుకు ఓటీపీ నెంబర్ కొసం తప్పక తమ ఫోన్ వెంట తీడుకోరావాలని సూచించారు. రైతులు తమ ఫోన్ నెంబర్ను ఆధార్ నెంబర్ తో తప్పకుండా అనుసంధానం చేసుకోవాలన్నారు.
ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్ పుస్తకము, బ్యాంకు ఖాతా నెంబర్, జిల్లా కలెక్టర్ చె నియమించబడిన అధికారి ధ్రువీకరణ పత్రం తప్పక జాతచేయాలనీ సూచించారు. బ్యాంకు ఖాతా పని చేస్తున్నట్లుగా బ్యాంకు అధికారుల నుండి ధ్రువీకరించుకొవాలని తెలిపారు.
దళారులు, మధ్యావర్థుల ప్రలోభపెడితే సంబంధిత అధికారులకు వెంటనే తెలియపర్చాలన్నారు. రైతులు తమ ధాన్యం అమ్ముకోవాడంలో ఏదైనా సమస్యలు ఎదురైనట్లయితే సంబంధిత పౌర సరఫరాల అధికారులను, RDO ను, తహసీల్దార్ ను లేదా వ్యవసాయ అధికారిని సంప్రదించాలని ఈ సందర్బంగా తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ విమల తదితరులు పాల్గొన్నారు.

Share This Post