రైతులు నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుని అధిక దిగుబడులు సాధించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

రైతులు నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుని అధిక దిగుబడులు సాధించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

బుధవారం ఐజ మండలం ఉత్తనూర్ గ్రామం లో శ్రీ ధన్వంతరి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రైతు మేళా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై వివిధ శాఖల, కంపెనీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పాత పద్ధతులను వదులుకొని ఆధునిక టెక్నాలజీ , ఆధునిక యంత్రికరణ గురించి కొత్త విషయాలు తెలుసుకొని నూతన పద్ధతులతో వ్యవసాయం చేసి అధిక దిగుబడులు సాధించాలని అన్నారు. రైతులు తక్కువ నీటితో ఎక్కువ ఫలసాయం అందించే వంగడాలను పండించాలని అన్నారు. వరికి బదులు ఇతర ఆరుతడి పంటలు పండించి రైతులు ఆర్థికంగా ఎదగాలని అన్నారు. మిరప, వేరు శనగ , మొక్కజొన్న ప్రత్యేకంగా పండించడం జరుగుతుందని, వీటిలో నష్టం రాకుండా సాగు చేసుకోవాలని అన్నారు. రైతులు కొత్త పద్ధతులను అనుసరిస్తే, పంట దిగుబడి, ఎక్కువ ఆదాయం, పంట సాగు బాగా ఉంటుందని అన్నారు.  ఈ రైతు మేళాలో నూతన సాంకేతిక వ్యవసాయం, నూతన వంగడాల గురించికృషి విజ్ఞాన కేంద్రం  పాలెం, మదనాపురం కృషి విజ్ఞాన కేంద్రం, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రి బయోటెక్, కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ,  వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు చేశారు. మత్స్య శాఖ, అగ్రికల్చర్, హార్టికల్చర్, పలు శాఖ ల అద్వర్యం లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను కలెక్టర్  పరిశీలించారు. ఈ సందర్భంగా ఇటీవల కొత్తపల్లి గ్రామంలో గోడ పడి మరణించిన కుటుంబ సభ్యులకు దాతల  నుండి సేకరించిన రెండు లక్షల 30 వేల ఆర్థిక సహాయాన్ని చెక్ రూపం లో కలెక్టర్ గారికి  అందజేశారు.

ఈ కార్యక్రమంలో రైతు మేళా కన్వీనర్ తిరుమల్ రెడ్డి, అగ్రికల్చర్ కన్వీనర్ డి. విష్ణువర్ధన్ రెడ్డి, కృపాకర్ రెడ్డి, రామకృష్ణ బాబు, వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, ఉద్యానవన అధికారి సురేష్ , డి.ఆర్.డి.ఎ ఉమాదేవి, మత్స్య శాఖ, ఇతర అనుబంధ శాఖల అధికారులు ,ఆయా కంపెనీల యజమానులు, తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————–

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల ద్వారా జారీ చేయడమైనది.

 

 

 

 

 

 

 

 

 

 

 

Share This Post