రైతులు పండించిన వరి ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధరకు అమ్మాలని, రైతులు దళారుల చేతిలో మోసపోవద్దు – జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి

రైతులు పండించిన వరి ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధరకు అమ్మాలని, రైతులు దళారుల చేతిలో మోసపోవద్దని జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి అన్నారు. శనివారం స్థానిక సుఖఃజీవన్ రెడ్డి ఫంక్షన్ హాల్లొ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వహణ పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జడ్పి చైర్మన్ ముఖ్య అతిథిగా హాజసరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రం ధాన్యం కొనుగోలు చేయమని చెప్పినా రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఆదుకోవాలని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేందుకు అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ధాన్యం సేకరణ సజావుగా సాగేందుకు ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలని కొనుగోలు కేంద్రాల ప్రెంభోత్సవానికి పిలవాల్సిందిగా తెలియజేసారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ధాన్యం సేకరణలో రైతులకు గాని మిల్లర్లకు గాని సమస్య లేకుండా ఉండాలంటే ఎఫ్.ఏ.క్యూ నిబంధనల ప్రకారం తేమ 14 శాతానికి మించకుండా, తాలు, చెత్త లేకుండా చూసి సేకరించాలని కొనుగోలు కేంద్రాల ప్రతినిధులను సూచించారు. ఇదే విషయాన్ని ప్రజాప్రతినిధులు, కొనుగోలు కేంద్రాల ప్రతినిధులు రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిచి రైతులు నష్టపోకుండా అవసరమైన మేరకు మార్కెటింగ్ శాఖ నుండి తాడ్పలిన్లు తీసుకువెళ్లాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు కలుగకుండా ఏ.ఈ.ఓ ల ద్వారా రైతులకు టోకన్లు జారీ చేయించి టోకన్ల ప్రకారమే ధాన్యం సేకరణ జరిగేవిధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. 224 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గత సంవత్సరం ధాన్యం రవాణాలో వచ్చిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈసారి డివిజన్ల వారిగా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లను నియమించడం జరిగిందన్నారు. వరిధాన్యం శుభ్రం చేసె యంత్రాలు సైతం మార్కెటింగ్ శాఖ వద్ద సిద్ధంగా ఉన్నాయని అవసరమైన వాళ్ళు తీసుకువెళ్లాలని తెలిపారు. నాణ్యత బాగా లేదని ధాన్యం లారీ రైస్ మిల్ నుండి తిరిగిరాకుండా నాణ్యమైన ధాన్యమే సేకరించి పంపించాలన్నారు. గన్ని బ్యాగులకు గాని, రవాణాకు గాని ఎలాంటి సమస్యలు లేకుండా చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైస్ మిల్లర్స్ ప్రతునిధులు, జడ్పిటిసిలు, ఎంపీపీ లు, పి.ఏ.సి.ఎస్. చైర్మన్లు, సర్పంచులు కొనుగోలు కేంద్రాల వద్ద గత సంవత్సరం తలెత్తిన సమస్యలను కలెక్టర్ దృష్టికి తీడుకొచ్చారు.
ఈ అవగాహన కార్యక్రమానికి అదనపు కలెక్టర్ రాజేష్ కుమార్, సివిల్ సప్లయ్ అధికారి మోహన్ బాబు, జిల్లా కోపరేటివ్ అధికారి పత్యానాయక్, సివిల్ సప్లయ్ మేనేజర్ బాలరాజ్, మార్కెటింగ్ శాఖ అధికారిణి బాలామణి, కొనుగులు కేంద్రాల ప్రతినిధులు, మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post