రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలి : జిల్లా కలెక్టర్‌ భారతి హోకళ్ళికేరి

యాసంగిలో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని, ఆ దిశగా సంబంధిత శాఖల అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. ఆదివారం జిల్లాలోని లక్షైట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ యాసంగిలో వరి పంటను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగదని, ఈ విషయాన్ని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలని, వరి మాత్రమే సాగు చేయాలనుకుంటే విత్తన ఉత్పత్తి కంపెనీలు, రైస్‌మిల్లర్లతో ఒప్పందం ఉన్న రైతులు సాగు చేయవచ్చని తెలిపారు. యాసంగిలో రైతులు ప్రత్యామ్నాయంగా పప్పు దినుసుల పంటలైన పెసర, మినుము, పంటలు, నూనె గింజల పంటలైన వేరు శనగ, నువ్వులు, చిరు ధ్యాన పంటలైన జొన్నలు, సజ్జలు, కొ(ర్రలు, కూరగాయల పంటల సాగు దిశగా రైతులు దృష్టి సారించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వినోద్‌కుమార్‌, ఏ.ఓ. ప్రభాకర్‌, ఏ. ఈ.ఓ.లు మహేష్క్‌ రైతులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post