రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు

సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి రైతు వేదికలో మంగళవారం యాసంగి లో ప్రత్యామ్నాయ పంటల సాగు పై రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు రైస్ మిల్లు యజమానులతో ఒప్పందం చేసుకొని వరి పంటను సాగు చేసుకోవాలని సూచించారు. యాసంగి లో దాన్యం కొనుగోలు ఉండబోవని స్పష్టం చేశారు. రైతులు ఆరుతడి పంటలు గా పొద్దుతిరుగుడు, శనగ, వేరుశెనగ, గోధుమ, పెసర మినుము వంటి పంటలు వేసుకోవాలని సూచించారు. వ్యవసాయ భూములలో రైతులు ప్రతిసారి ఒకే రకం పంటలు పండించవద్దని పంటల మార్పిడి విధానాన్ని అవలంబించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రత్యామ్నాయ పంటల సాగు గోడ ప్రతులను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ జానకి, ఎం పి టి సి సభ్యులు లక్ష్మి, సహకార సంఘం చైర్మన్ సదాశివ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి, జిల్లా వ్యవసాయ అధికారి ని భాగ్యలక్ష్మి, ఏ డి ఏ రత్న, వ్యవసాయ విస్తీర్ణ అధికారి శ్రీనివాస్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు. —————— జిల్లా ప్రజా సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చేజారి చేయనైనది.

Share This Post