రైతులు ప్రత్యామ్నాయ పంటలు చేపట్టేలా వ్యవసాయ అధికారులు ప్రోత్సహించాలి…

ప్రచురణార్ధం

రైతులు ప్రత్యామ్నాయ పంటలు చేపట్టేలా వ్యవసాయ అధికారులు ప్రోత్సహించాలి…

మహబూబాబాద్, డిసెంబర్,16.

రైతులు ప్రత్యామ్నాయ పంటలు చేపట్టేలా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

గురువారం కలెక్టర్ కార్యాలయ ప్రజ్ఞ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆరు తడి పంటల సాగు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ తీరులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి వ్యవసాయ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…భారత ఆహార సంస్థ (ఎఫ్.సి.ఐ.) యాసంగి వరిపంటను కొనుగోలు చేయమని స్పష్టం చేసినందున రైతులు వరిపంట వేయనీయరాదని, ప్రత్యామ్నాయ పంటలను వేసుకునేలా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

విత్తనాల కొరకు, జీవనానికి మాత్రమే ధాన్యం వినియోగించుకునే అవకాశం ఉందని, విక్రయించు కునేందుకు కొనుగోలు కేంద్రాలు ఉండవన్నారు.

వరిపంట వేయరాదన్న సమాచారం రైతుకు తప్పని సరిగా చేరాలని, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయనందున విక్రయాలు ఉండవని ముందే చెప్పాలన్నారు.

2021 వానాకాలం పంట నమోదు కార్యక్రమం నివేదిక స్పష్టత చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం వివరాల సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు.

ధాన్యం కొనుగోళ్లులో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రైతుకు టోకెన్ జారీ చేసి వివరాలు ట్యాబ్ లో నమోదు చేసిన వెంటనే కొనుగోలు చేసిన ధాన్యాన్ని అదే రోజు రవాణా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

227 కొనుగోలు కేంద్రాల ద్వారా 47 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు.7మండలాలయిన మహబూబాబాద్, గార్ల, బయ్యారం, గంగారం, చినగూడూరు, కురవి, తొర్రుర్ మండలాలలో ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్, సహాయ వ్యవసాయ అధికారి లక్ష్మీనారాయణ, మండల వ్యవసాయ అధికారులు ,వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.
—————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి, కార్యాలయం…మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post