రైతులు యాసంగి లో వరికి బదులుగా లాభదాయకమైన ప్రత్యమ్నాయ పంటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

పత్రిక ప్రకటన                                                    తేది: 06-12-2021

రైతులు యాసంగి లో వరికి బదులుగా లాభదాయకమైన ప్రత్యమ్నాయ పంటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

సోమవారం ఇటిక్యాల మండలం బీచుపల్లి, కొండేరు గ్రామాలు, మానోపాడు మండలాలను   సందర్శించారు. బీచుపల్లి గ్రామం లో ఐ.కె.పి ఆధ్వర్యం లోని వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖి చేశారు. కొనుగోలు ప్రక్రియ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాపిగా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని అన్నారు. కేంద్రం లో ప్యాడి క్లీనింగ్ మెషిన్ లు అందుబాటులో ఉన్నాయా, అన్ని పరికరాలు సరిగా పని చేస్తున్నాయా అని, వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోజుకి ఎన్ని బస్తాల ధాన్యం సేకరిస్తున్నారని అధికారులను అడిగి  తెలుసుకున్నారు. అక్కడి రైతులతో మాట్లాడి వారు కేంద్రానికి  తీసుకువచ్చిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. బీచుపల్లి లోని వాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామం లో వాక్సిన్ వేసుకొని వారిని గుర్తించి వారందరికీ వాక్సిన్ వేయాలని అన్నారు.  ప్రజలకు వాక్సినేషన్ పై అవగాహన కల్పించి ఈ నెల చివరి వరకు 100 శాతం వాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.  వలస వచ్చిన వారు ఉంటే వారి ఆదార్ నెంబర్ ద్వారా covid పోర్టల్ లో  వాక్సిన్ వేసుకున్నారో లేదో చెక్ చేయాలనీ సూచించారు. ఆశలు, ఏ ఎన్ ఎం లు ప్రతి గ్రామం లో ఇంటింటికి తిరిగి  అందరికి రెండు డోస్ లు వ్యాక్సి నేషన్  100 శాతం పూర్తి చేయాలనీ తెలిపారు.

జాతీయ రహదారి పై హరిత హారం లో బాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. నాటిన మొక్కలకు కంచే ఏర్పాటు చేసి , మొక్కలను సంరక్షించాలని అన్నారు. రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటి ఎవెన్యూ ప్లాంటేషన్ చేయాలనీ సూచించారు.  మొక్కలకు మధ్య గ్యాప్ ఇచ్చిగన్నేరు, డేకోమా  మొక్కలు  నాటలని అధికారులకు  సూచించారు.

అనంతరం కొండేరు గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ప్రత్యామ్నాయ పంటల అవగాహన కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్  మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం యాసంగి లో వరి కొనుగోలు చేయనందున ,  రైతులు యాసంగి లో వరికి  బదులుగా ఇతర ప్రత్యామ్నాయ పంటలు పండించే విధంగా వ్యవసాయ అధికారులు వారికి అవగాహన కల్పించాలని అన్నారు.    రైతు వేదికలు నిర్వహించి, రైతులకు  లాభదాయకమైన పంటల గురించి   విస్త్రుత ప్రచారం చేయాలని , మినుము, పెసర, చిరుధాన్యాల తో పాటు , ఆయిల్ పామ్ వంటి లాబదాయకమైన పంటలు పండించే విధంగా వారిని ప్రోత్సహించాలని, ప్రత్యామ్నాయ పంటలకు సంబంధిచిన విత్తనాల ఎక్కడ అందుబాటులో ఉంటాయో రైతులకు తెలియజేయాలని  అధికారులకు సూచించారు. భారత ఆహార సంస్థ వారు  వరి కొనుగోలు చేయట్లేదని,  వరి వేసుకుంటే మీరే స్వంతంగా అమ్ముకోవలసి ఉంటుందని రైతులకు తెలిపారు. ఈ సందర్బంగా ప్రత్యమ్నాయ పంటలకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు.

 

కొండేరు గ్రామం వాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. గ్రామం లో ఉన్న ప్రజలందరికీ రెండు డోసు లు వాక్సిన్ వేయాలని, ఈ నెల చివరి వరకు వంద శాతం వాక్సినేషన్ పూర్తి చేయాలనీ వైధ్యదికారులకు ఆదేశించారు. ఆదార్ నెంబర్ ఆధారంగా వాక్సిన్ వేసుకొని వారి జాబితా తయారు చేయాలనీ,  టీం లను ఏర్పాటు చేసి గ్రామాల్లో పెండింగ్ ఉన్నవారందరికీ వాక్సిన్ వేయించాలని అధికారులకు ఆదేశించారు.

తదనంతరం మానవపాడు మండలం లోని తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖి చేశారు. కార్యాలయం లోని అన్ని ఫైల్స్ ను పరిశీలించారు. ధరణి దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతం లో ఫైర్ ఆక్సిడెంట్ జరిగిన గదిని , కాలిపోయిన రికార్డు లను పరిశీలించారు. ముందు ముందు అలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మండలం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఆరోగ్య కేంద్రాన్ని ఎప్పటికప్పుడు పరిశుబ్రంగా ఉంచుకోవాలని అన్నారు. డెలివరీ అయిన మహిళ తో మాట్లాడి అక్కడ వైద్య సేవల గురించి తెలుసుకున్నారు.

కలెక్టర్ గారితో పాటు  జిల్లా వైద్యాధికారి చందు నాయక్ , డి ఎస్ ఓ రేవతి, వ్యవసాయ అధికారి సక్రియ నాయక్, డాక్టర్ శశికిరణ్, డాక్టర్ సయద్ ఇర్షాద్,  తహసిల్దార్ సుబ్రహ్మణ్యం, వరలక్ష్మి, సర్పంచులు షర్మిల, ఈరన్న, ఎంపిటిసి వీరన్న,  తదితరులు పాల్గొన్నారు.

——————————————————————————–

 

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చె జారి చేయబడినది.

Share This Post