రైతులు యాసంగి లో వరి కన్నా మెరుగైన , ఆర్థిక స్వావలంబన కల్పించే పంటలను వేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు.

సోమవారం నాడు ఉదయం ధర్మసాగర్ మండలంలోని మల్లక్ పల్లి గ్రామంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్య అథితిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా యాసంగి లో వరి ధాన్యం కొనుగోలు కు అవకాశం లేనందున రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కోరారు. ఇందుకుగాను అనేక ప్రత్యామ్నాయ పంటలు ఉన్నాయని, ముఖ్యంగా మినుము, పెసర, చిరుధాన్యాల తో పాటు ,ఆయిల్ పామ్, కూరగాయల పంటల వైపు పెంపకాన్ని చేపట్టాలని చెప్పారు. ఆయిల్ పామ్ పెంపకం వల్ల ఎంతో లాభం వస్తుందని అన్నారు. రైతులు అదును చూసి పంటలు సాగు చేసుకుని లాభపడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మినుము, పెసర తో పాటు, చిరు ధాన్యాలు, పప్పు దినుసులు వంటి అనేక పంటల వల్ల వరి కన్నా మెరుగైన, ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని అన్నారు. వీటన్నిటి గురించి తెలియజేసేందుకు ప్రస్తుతం ప్రతి మండలానికి వ్యవసాయ అధికారి తోపాటు, వ్యవసాయ విస్తరణ అధికారులు ఉన్నారని అన్నారు. డిమాండ్ ఉన్న పంటలను వేసి రైతులు మంచి లాభాలు పొందాలని, ప్రభుత్వం రైతులకు రైతు బంధు, రైతు భీమా తో పాటు, 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వటమే కాకుండా, చెక్ డ్యాములు, చెరువులు, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని అందజేస్తున్నదని, రైతులు ఆయా పంటల పై అవగాహన కల్పించుకోని సాగు చేయాలని కలెక్టర్ కోరారు.

తొలుత బాబా సాహెబ్ అంబెడ్కర్ 65 వ వర్ధంతి సందర్బంగా అంబెడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ అవగాహన సదస్సులో సహాయ వ్యవసాయ సంచాలకులు దామోదర్ రెడ్డి, వ్యవసాయ అధికారి పద్మ, వ్యవసాయ విస్తరణ అధికారి పవన్ కళ్యాణ్, గ్రామ సర్పంచ్ మునిగెల రాజు, ఎంపీటీసీ భీంరెడ్డి కరుణాకర్, ఉప సర్పంచ్ సుధాకర్, గ్రామ రైతు బంధు సమితి మెంబెర్స్ , గ్రామ రైతులు తద్ధితరులు పాల్గొన్నారు .

Share This Post