రైతులు వచ్చే వేసంగి లో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గు చూపాలి:జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

* ప్రచురణార్థం *
ములుగు జిల్లా
డిసెంబర్ 7 ( మంగళవారం ).
ములుగు జిల్లా రైతులు వచ్చే వేసంగి లో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గు చూపాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య రైతులకు అవగాహన కల్పించారు.
మంగళవారం రోజున క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ములుగు మండలం మల్లంపల్లి శ్రీరామ్ నగర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులకు తగిన సూచనలు సలహాలు అందించారు . కలెక్టర్ ముందుగా కొనుగోలు కేంద్రంలో మార్చు రైజర్ ద్వారా బస్తాలలో పట్టిన ధాన్యాన్ని తేమ శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తేమశాతం కరెక్ట్ గా చెక్ చేసుకుని అన్ని బస్తాల ధాన్యాన్ని మిల్లర్ దగ్గరకు పంపినట్లయితే రైతులకు తరుగు లేకుండా గిట్టుబాటు ధర వస్తుందని అన్నారు. లారీల్లో లోడ్ చేసిన ధాన్యం మిల్లర్లు దింపు కున్నప్పుడు ఒక్క బస్తా తేమశాతం సరిగా లేక పోయినా ధాన్యం లారీ లోడ్లో ఉన్న బస్తాలకు అన్నింటికి తరుగు తీసి వేస్తున్నారని ఇక్కడ ఇబ్బందులు వస్తున్నాయని కొనుగోలు కేంద్రాల లోనే దీని సమస్యలు పరిష్కరించాలని అన్నారు .ఇద్దరు ముగ్గురు రైతులు లారీ లో ధాన్యాన్ని లోడ్ చేసినప్పుడు ఒక రైతు ధాన్యం తేమ శాతం సరిగా లేకుంటే అతనితోపాటు తేమ శాతం కరెక్ట్ గా ఉన్న మిగతా రైతుల ధాన్యాన్ని కూడా తరుగు తీసివేసి నష్టాలు చవిచూడాల్సి వస్తుందని అన్నారు 2022 వేసంగి సీజన్లో వరి పంట వేయ దలచిన రైతులు సీడు కంపెనీ తో సంప్రదించి వాళ్లు బాండ్ మేరకు వారు కొనుగోలు చేసే విధంగా వేసుకోవచ్చు అన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయదని చెప్పారు. పూర్తిగా నల్లరేగడి భూమి అనుకూలమైన దని వరి పంట తప్ప వేరే పంటలు పండని ఈ భూమి లో ప్రత్యామ్నాయంగా జొన్న సాగు చేయవచ్చునని రైతులు తెలిపిన మేరకు జిల్లా వ్యవసాయ అధికారులు దీని పై రైతులు తెలిపిన మేరకు జిల్లా వ్యవసాయ అధికారులు దీని పై రైతులకు అవగాహన చేయాలన్నారు. వరి వద్దు ప్రత్యామ్నాయ పంటలే ముద్దు అనే నినాదంతో ప్రత్యామ్నాయ పంటలతో ముందుకు పోవాలి అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీ పాల్, మండల వ్యవసాయ అధికారి, సంతోష్
ఏఈఓ సాయి కుమార్ సంబంధిత రైతులు పాల్గొన్నారు.

Share This Post