రైతులు వారి ఆలోచన సరళిని మార్చుకొని, వరి కి బదులుగా ప్రత్యమ్నాయ పంటలను పండించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

పత్రికా ప్రకటన                                                         తేది 10-12-2021

రైతులు వారి ఆలోచన సరళిని  మార్చుకొని, వరి కి బదులుగా ప్రత్యమ్నాయ  పంటలను పండించాలని  జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

శుక్రవారం కె.టి దొడ్డి మండలం రైతు వేదిక భవనం లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యం లో ఏర్పాటు  చేసిన రైతు అవగాహన సదస్సు లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ యాసంగి లో వరి కి బదులుగా ఇతర ప్రత్యామ్నాయ పంటలు పండించే విధంగా రైతులు వారి ఆలోచన సరళి మార్చుకోవాలని, ఎ.ఈ.ఓ లు దృష్టి పెట్టి రైతులు వరి సాగు తగ్గించి ఇతర పంటలు పండించేలా వారికి అవగాహన కల్పించాలని అన్నారు. ఎఫ్.సి ఐ వారు వరి కొనుగోలు చేయనందున, యాసంగి లో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని, ప్రత్యామ్నాయ పంటలు పండించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. కొర్రలు, జొన్నలు, పప్పు ధాన్యాలు, ఇతర చిరు ధాన్యాలను మీ ప్రాంతానికి అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకొని వాటిని పండించాలని అన్నారు. ఎక్కువ కాలం వరి పండిస్తే భూమి సారం కోల్పోతుందని,  ఆరుతడి పంటలు పండిస్తే భూసారాన్ని రక్షించుకోవచ్చని, తక్కువ  నీటి తో ఎక్కువ పంట సాగు చేయొచ్చని, అదేవిధంగా తక్కువ ఖర్చు తో అధిక  లాభం పొందవచ్చని, భూసారాన్ని బట్టి భూమికి సరిపోయే ఆరుతడి పంటలు వేస్తే రైతులు నష్ట పోకుండా లాభం పొందవచ్చని తెలిపారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యామ్నాయ, ఆరుతడి పంటల గురించి సలహాలు , సూచనలు తీసుకొని , ప్రత్యామ్నాయ  పంటల పై పూర్తిగా అవగాహన కల్పించుకొని పంటలను సాగు చేయాలనీ కోరారు.

అనంతరం కె.టి దొడ్డి మండలం తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖి చేశారు. కార్యాలయం లో అన్ని ఫైల్స్, రిజిస్టర్ లను పరిశిలించారు. రికార్డు రూమ్ ను పరిశీలించి , కార్యాలయ సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు.

నందిన్నె గ్రామం లోని వాక్సినేషన్ కేంద్రాన్ని, ప్రైమరీ పాటశాలను,  అంగన్వాడి సెంటర్ ను తనిఖీ చేశారు. వాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించి, గ్రామం లో ఎంత శాతం వాక్సినేషన్ పూర్తి అయిందని అడిగి తెలుసుకున్నారు. గ్రామం లో 18 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరికి రెండు డోస్ ల వాక్సిన్ వేయాలని, ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా వాక్సిన్ వేసుకోవడానికి ముందుకు వచ్చేలా వారికి అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామం లో ప్రతి ఒక్కరికి వాక్సిన్ వేసి గ్రామాన్ని వంద శాతం వాక్సినేటేడ్ గ్రామం గా తీర్చి దిద్దాలని ఎ.ఎన్.ఎం . ఆశా వర్కర్ లకు సూచించారు. సబ్ సెంటర్ ల  వారిగా ఎంత శాతం వాక్సినేషన్ పూర్తి అయిందో జాబితా తయారు చేసి పంపించాలని అన్నారు.

నందిన్నె చెక్ పోస్ట్ ను తనిఖి చేశారు. ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా చర్యలు చేపట్టాలని, మన రాష్ట్రం నుండి ధాన్యం పక్క రాష్ట్రాలకు వెళ్ళకుండా జాగ్రత్త పడాలని అన్నారు. చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన టీం లతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాయచూరు నుండి ధాన్యం వస్తుందా, వచ్చి పోయే వాహనాలను తనిఖి చేస్తున్నారా, సి.సి టి.వి కెమెరాలను ఏర్పాటు చేశారా లేదా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.

పాతపాలెం గ్రామ పంచాయతి కార్యాయం లో ఏర్పాటు చేసిన వాక్సినేషన్ కేంద్రాన్ని  పరిశిలించారు. ఆశా లు ఇంటింటికి తిరిగి అందరికి వాక్సిన్ వేయాలని, వాక్సిన్ వేసుకున్న వారి జాబితా తయారు చేయాలనీ, ఆన్లైన్ లో అన్ని వివరాలను అప్ డేట్ చేయాలనీ అన్నారు.

కార్యక్రమం లో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చెన్నయ్య, జెడ్పిసిఈఓ విజయ నాయక్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్, ఎం.ఈ.ఓ కరుణ శ్రీ, ఎం.ఆర్.ఓ సుందర్ రాజు, ఎంపిడిఓ పాండు, తదితరులు, పాల్గొన్నారు.

——————————————————————————

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల  గారి చే  జారీ చేయబడినది.

Share This Post