రైతులు సకాలంలో ఆయిల్ ఫాం మొక్కలు నాటుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు.

రైతులు సకాలంలో  ఆయిల్ ఫాం మొక్కలు నాటుకోవాలని జిల్లా  అదనపు కలెక్టర్  శ్రీహర్ష తెలిపారు.

శుక్రవారం ఎర్రవల్లి లోని ఆయిల్ పామ్ నర్సరీని సందర్శించారు. ఆయిల్ ఫాం సాగు వివరాలను అక్కడ సిబంది ని అడిగి తెలుసుకున్నారు. జిల్లా లో  అతి  త్వరలోనే 100 కోట్లతో గంటకు 30 టన్నుల  ఆయిల్ ఫాం గెలలను ప్రాసెసింగ్ చేసే సామర్థ్యము గల యంత్రాలను అమార్చబోతున్నామని  టి ఎస్ ఆయిల్ ఫాం  అసిస్టెంట్ మేనేజర్ వెంకటేష్  కలెక్టర్ గారికి తెలిపారు.

 

ఈ సంవత్సరం  గద్వాల్ జిల్లాకు 1500 ఎకరాలలో రైతులు  మొక్కలు నాటుకొనుటకు సరిపడా 85500 ఆయిల్ పామ్ మొక్కలు  సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఆయిల్ పామ్ లో స్ప్రింగ్ రకం ఈ ప్రాంతానికి అనువైనదని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉద్యాన వన శాఖ అధికారి సురేష్,  నర్సరీ ఇంచార్జి శ్రీమతి సుష్మిత ఆయిల్ పామ్ సిబ్బంది ,తదితరులు  పాల్గొన్నారు.

_———————————————————————————————-

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి ద్వారా జారి చేయబడినది.

 

Share This Post