రైతుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

రైతుల ఆర్థిక, సంక్షేమ అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. గురువారం జిల్లాలోని భీమారం మండల కేంద్రంలోని రెతువేదిక భవనంలో మ్యాట్రిక్స్‌ ఆయిల్‌ ఫామ్‌ కంపెనీ ఆధ్వర్యంలో ఆయిల్‌ఫామ్‌ సాగుపై వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ సాధారణంగా ప్రతి సారి వరి సాగు చేస్తున్న రైతులు అధిక లాభాలు గడిస్తున్న ఆయిల్‌ఫామ్‌ సాగుపై దృష్టి సారించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, జిల్లాలో అధిక శాతం వరి సాగు చేయడం జరుగుతుందని, ప్రస్తుత మార్కెట్‌లో అధిక డిమాండ్‌ కలిగిన ఆయిల్‌ఫామ్‌ తోటల సాగుతో వచ్చే లాభాలపై ప్రతి రైతుకు వివరించాలని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఆయిల్‌ఫామ్‌ సాగును ప్రోత్సహిస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తి స్థాయిలో నిషేధించేందుకు సంబంధిత శాఖల అధికారులు కృషి చేయడంతో పాటు ప్రజలు సహకరించాలని తెలిపారు. అనంతరం మ్యాట్రిక్స్‌ ప్రతినిధి ఉదయ్‌కుమార్‌ ఆయిల్‌ఫామ్‌ తోటల సాగు, అనువైన వాతావరణం, వర్షపాతం, ఉష్ణోగ్రత, తేమ, నేల రకం, సాగు చేయు వంగడం, నాటు సమయం, సాగు విస్తీర్ణం, మొక్కల మధ్య దూరం, పెరుగుదల, దిగుబడి తదితర అంశాలపై ప్రొజెక్టర్‌ ద్వారా వివరించడంతో పాటు హెక్టారు విస్తీర్ణంలో 30 టన్నుల దిగుబడి వస్తుందని, ఒక్క టన్నుకు 9 వేల రూపాయల నుండి 10 వేల రూపాయలు ఆదాయం ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌.సి. కార్పొరేషన్‌ ఈ.డి. ప్రసాద్‌, జిల్లా వ్యవసాయ అధికారి వి.వినోద్‌కుమార్‌, జిల్లా ఉద్యాన,
పట్టు పరిశ్రమల శాఖ అధికారి శ్యాంరాథోడ్‌, జిల్లా (గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, ముఖ్య ప్రణాళిక అధికారి కృష్ణయ్య, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌, మండల పంచాయతీ అధికారి శ్రీపతిబాపు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post