రైతుల ఆర్థిక అభివృద్ధి ని బలోపేతం చేయాలి…

ప్రచురణార్థం

రైతుల ఆర్థిక అభివృద్ధి ని బలోపేతం చేయాలి…

మహబూబాబాద్, సెప్టెంబర్ 14.

రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

మంగళవారం ప్రజ్ఞ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ ఉద్యాన వనాలు మత్స్య , పశుసంవర్ధక శాఖల కార్యకలాపాలపై సమగ్రంగా సమీక్షించారు.

తొలుత వ్యవసాయ శాఖ కార్యకలాపాలను సమీక్షించారు. నూరు శాతం పంట రుణాల లక్ష్యాలను సాధించాలని అధికారులను ఆదేశించారు.
వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ నివేదికలు సమర్పించాలన్నారు. రైతు వేదికల నిర్వహణ వ్యవసాయ అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. రైతులందరికీ హెల్త్ కార్డ్స్ తప్పనిసరిగా ఉండాలని రైతు కుటుంబాల భద్రతకు రైతు బీమా తప్పనిసరిగా చేయించాలన్నారు. భీమా కొరకు ప్రతి రైతు సమర్పించిన దరఖాస్తును రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు రైతు కల్లాల ఆవశ్యకతను తెలియజేసి నిర్మించుకునేలా ప్రోత్సహించాలన్నారు.
పంట నమోదు గోదాముల సౌకర్యాల పై అధికారుల ను అడిగి తెలుసుకున్నారు.

రైతులను సంఘటితపరచి చైతన్యవంతులను చేయాలని భూసార పరీక్షల ఆవశ్యకతను తెలియజేసి పరీక్షలు నిర్వహించాలని భూసారాని కి తగినట్లుగా పంటలు వేసే విధంగా వ్యవసాయ అధికారులు రైతుల కు అవగాహన పరచాలన్నారు.

ఉద్యాన శాఖ ద్వారా ఆయిల్ ఫామ్ సాగు పై రైతులకు అవగాహన పరుస్తూ పంటను విస్తృతంగా వేసే విధంగా ప్రోత్సహించాలన్నారు.
రైతులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని లాభదాయక పంటలపై అవగాహన పరచాలన్నారు.

జిల్లాలోనే 161 మత్స్యకారుల సంఘాలలో చేపల పెంపకం పై ఆధారపడి జీవిస్తున్న వారి వివరాలు అందజేయాలని అదేవిధంగా మత్స్యకారుల కుటుంబాలను బలోపేతం చేయా అన్నారు.

పాడి పరిశ్రమను విస్తృత పరచాలని పశుసంవర్ధక శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జంతు సంక్షేమం పై దృష్టి పెట్టాలని మాంసపు విక్రయాలపై చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీలలో బహిరంగ ప్రదేశాలలో విక్రయించకుండా నిరోధించా లన్నారు. కోళ్ల ఫారాలను అభివృద్ధి పరచాలి అన్నారు.

ఈ సమావేశంలో వ్యవసాయ అధికారి చత్రు నాయక్, ఉద్యాన అధికారి సూర్యనారాయణ మత్స్య శాఖ అధికారి బుజ్జిబాబు పశుసంవర్ధక శాఖ అధికారి సుధాకర్ వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది.

Share This Post