ప్రచురణార్ధం
మే.04 ఖమ్మం:
రైతుల ఉత్పత్తుల విక్రయాలకు మెరుగైన వసతులు, అత్యాధునిక సౌకర్యాలు, మార్కెటింగ్ సదుపాయాలతో, మోడల్ మార్కెట్లను రైతాంగానికి అందుబాటులోకి తెస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం ముద్దులపల్లిలో రూ. 19.90 కోట్లతో నిర్మిచనున్న వ్యవసాయ మార్కెట్ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్, పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమితో కలిసి బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మద్దులపల్లి మార్కెట్ను మోడల్ మార్కెట్ గా తీర్చిదిదెందుకు కృషిచేస్తామన్నారు. ఖమ్మం జిల్లా రైతాంగానికి పంటలు పండించడంలో ప్రత్యేకత ఉందని, మార్కెట్ నుంచి రైతును దూరం చేసి రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యాపారుల పాలు చేస్తుందన్నారు. అన్ని రంగాలలో వ్యవసాయరంగానికి మించిన రంగం మరొకటి లేదన్నారు. కంప్యూటర్ యుగంలో కూడా దేశానికి అన్నం పెట్టేది రైతాంగమే అన్నారు. అలాంటి రైతాంగాన్ని గత పాలకుల అనాలోచిత నిర్ణయాలతో నిర్లక్ష్యం చేసారని, రైతులకు 24 గంటల ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారులు -సలహాలు, సూచనలతో వ్యవసాయం చేస్తే లాభసాటిగా ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల చిన్నచూపు చూస్తుంది. ఇంతవరకు రైతులకు చేసిందేమీ లేదన్నారు. భారత దేశంలో పంట పండించడంలో తెలంగాణ రాష్ట్రాన్ని రైతాంగం ముందంజలో ఉంచిందన్నారు. రైతులకు రైతుభీమా , రైతు బంధు, పంటకు మద్దతు ధర అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ప్రత్యేక స్థానంలో ఉందన్నారు. దేశంలో తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయడం లేదన్నారు. రైతాంగాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెద్ద పీట వేసిందన్నారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి. నుండి రాష్ట్రంలో వ్యవసాయ రంగం పెద్దఎత్తున అభివృద్ధి సాధించించని, గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో పంట దిగుబడి జరిగిందన్నారు. రైతులకు పంట పెట్టుబడి, అవసరమైన విత్తనాలు, ఎరువులు, సకాలంలో అందించడంతో పాటు రైతులు ఉత్పత్తులను కొనుగోలుకు పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు. చేసి గిట్టుబాటు ధరను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నదని, తద్వారానే నేడు రాష్ట్రంలోని రైతాంగం సుభిక్షంగా ఉందని మంత్రి అన్నారు. రైతులు పంట ఉత్పత్తులను విక్రయించుకునేందుకు దూర ప్రాంతాలకు తరలి వెళ్ళకుండా సమీపంలోనే వ్యవసాయ మార్కెట్లను అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో ప్రభుత్వం. నూతన మార్కెట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని మంత్రి అన్నారు. దీనిద్వారా రైతులకు రవాణా, ఇతర ఖర్చులు ఆదా అవుతాయని, గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. ఉత్పత్తుల విక్రయాలకై మార్కెట్కు వచ్చే రైతులకు అవసరమైన అన్ని సదుపాయాలు, అత్యాధునిక మార్కెటింగ్ పద్ధతుల సౌలభ్యాన్ని వ్యవసాయ మార్కెట్లలో అందుబాటులో ఉంచడం జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి అన్నారు.
అనంతరం కూసుమంచి మండలం జక్కెపల్లి గ్రామంలో రూ.41 లక్షలతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహాకార పరపతి సంఘం నూతన కార్యాలయం, గోదాము భవనాలన్ని మంత్రులు ప్రారంభించారు.
నగర్ మేయర్ పునుకోలు నీరజ, జిల్లా పరిషత్ చైర్మెన్ లింగాల కమలరాజు, డి.సి.సి.బి. చైర్మెన్ కూరాకుల నాగభూషణం, సుడా ఛైర్మెన్ బచ్చు విజయ్ కుమార్, డి.సి.ఎమ్.ఎస్. చైర్మెన్ రాయల శేషగిరిరావు, ఏ.ఎమ్.సి ఛైర్మెన్ లక్ష్మీ ప్రసన్న, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, జిల్లా ఇంచార్జ్ వ్యవసాయ శాఖ అధికారిని సరిత, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యా చందన, జిల్లా సహకార శాఖ అధికారి విజయ కుమారి, రెవిన్యూ డివిజనల్ అధికారి రవీంద్ర నాధ్, మండల అభివృద్ధి అధికారి అశోక్, తహసీల్దార్ సుమ, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు..