రైతుల కు ఉజ్వల భవిష్యత్తు అందించాలన్న ఆయిల్ ఫామ్ సాగు ను ప్రోత్సహిస్తున్నాం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు

రైతుల కు ఉజ్వల భవిష్యత్తు అందించాలన్న ఆయిల్ ఫామ్ సాగు ను ప్రోత్సహిస్తున్నాం

– రిజర్వాయర్ల ఖిల్లా గా జిల్లా మారడంతో….వాతావరణంలో
తేమ శాతం పెరిగి
ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలంగా మారింది

-పామ్ ఆయిల్ రైతు పాలిట కల్పవృక్షం

– రైతులు మెరుగ్గా బ్రతకాలనే మా తాపత్రయం

– చరిత్రలో మొదటి సారి ఆయిల్ ఫామ్ సాగుకు బడ్జెట్ లో 1000 కోట్లు కేటాయించాo

-ఆయిల్‌పాం సాగులో సిద్దిపేట జిల్లా ను అగ్రస్థానంలో నిలవాలి

-ప్రభుత్వ రాయితీలతో సాగు సులభం

-ఆయిల్‌పాం సాగు రైతుల సౌకర్యార్థం 2/3 రోజుల్లో నర్మెట్ట లో పామాయిల్‌ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను భూమిపూజ

-ఆయిల్ ఫామ్ రైతులకు శిక్షణ కార్యక్రమం లో
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు

సిద్ధిపేట 17, మార్చి 2022:

రైతులు మెరుగ్గా బ్రతకాలి, బాగుండాలనే,వారికి ఉజ్వల భవిష్యత్తు అందించాలన్న ఆయిల్ ఫామ్ సాగు ను ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు అన్నారు.
 ఆయిల్‌పాం సాగుతో రైతులకు ఆర్థిక భరోసా కలుగుతుందని మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మొదటి సారి ఆయిల్ ఫామ్ సాగుకు రాష్ట్ర బడ్జెట్ లో 1000 కోట్లు కేటాయించామన్నారు.
ఆయిల్‌పాం పంట సాగులో సిద్దిపేట జిల్లా ను ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలపాలని సూచించారు.

చిన్న కోడూరు మండలం chandlapoor గ్రామంలో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో అయిల్ ఫామ్ సాగు పై 622 మంది ఆయిల్ ఫామ్ రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…

గతంలో తాను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు దశాబ్దాల క్రితం సత్తుపల్లి, ఆశ్వరావు పేట సందర్శించి నప్పుడు ఆ ప్రాంతంలో ఆయిల్ ఫామ్ సాగు చేస్తూ మంచి లాభాలు గడించడం తాను స్వయంగా చూశానని మంత్రి తెలిపారు.
సముద్రం నూట 120 నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉండడం వల్ల గాలిలో తేమశాతం అధికంగా ఉండి ఈ ప్రాంతాలు ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించానన్నారు. అప్పుడే సిద్దిపేట ప్రాంతంలో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టాలని భావించిన… గాలిలొ పొడి వాతావరణం ఉండడం వల్ల సాధ్యం కాలేదన్నారు.

తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో సిద్దిపేట జిల్లా రిజర్వాయర్ల ఖిల్లా గా మారడం, కాల్వలు, వాగులు, చెరువుల్లో సైతం వేసవి లో నీరు ఉండడంతో గాలి లో తేమ శాతం పెరిగిందన్నారు.

అదే సమయంలో సంప్రదాయ పంటల సాగు తో రైతులు నష్ట పోతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విధానాల తో తెలంగాణ, జిల్లాలలో వరిసాగు చేయాలేని పరిస్థితి ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు అందివచ్చిన అవకాశం ఆయిల్ ఫామ్ పంట సాగు నే అని మంత్రి తెలిపారు.

ప్రస్తుతం తెలంగాణలో ఆయిల్‌పామ్‌ సాగు రైతులకు మంచి లాభసాటిగా ఉందన్నారు. పామాయిల్‌ సాగుకు ప్రభుత్వం అనేక సబ్సీడీలు అందిస్తోందని తెలిపారు. మొక్కలు, ఎరువులు, డ్రిప్‌లపైన రాయితీలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. రైతులకు ఉజ్వల భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో సిద్దిపేట జిల్లాలో 50 వేల 585 ఎకరాలలో ఆయి ల్ పామ్ పంట సాగు లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశిం చిందని అన్నారు.
ఆయిల్ ఫామ్ మొక్కల కొరత ఏర్పడడంతో
మలేసియా, సింగపూర్, థాయిలాండ్ వంటి దేశాలకు అధికారులను పంపి 40 వేల ఎకరాలకు సరిపడా ఆయిల్ ఫామ్ స్పౌట్స్ తెప్పించామన్నారు. అలాగే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి రంగనాయక సాగర్ జలాశయం వద్ద 50 వేల ఎకరాలు ఆయిల్ ఫామ్ నర్సరీ కోసం కేటాయించామన్నారు.
ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 3 వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగును 622 మంది రైతులు చేపట్టారని అన్నారు. 5 ఎకరాల లోపు రైతులకు ఎకరాకు 81 వేల రూపాయల పైన రాయితీ, 5 ఎకరాలు ఆపైన సాగు చేసే రైతులకు 24,800 చొప్పున రాయితీ అందజేస్తున్న ట్లు మంత్రి తెలిపారు.

తరచూ
క్షేత్ర స్థాయి పర్యటన ల ద్వారా AEO లు, ఆయిల్ ఫామ్ ఫీల్డ్ అసిస్టెంట్లు
ఆయిల్ ఫామ్ పంట సాగులో వచ్చే సమస్యలు, ఇబ్బందులను పరిష్కరిస్తారని అన్నారు. రైతులు 3 సంవత్సరాలు పంటను జాగ్రత్తగా కాపాడుకుంటే దీర్ఘకాలికంగా మంచి ఫలితాలు ఉంటాయన్నారు.
ఆయిల్ పామ్ పంట సాగు తో రైతులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు.
ఒకసారి పెట్టుబడి పెడితే 30 ఏండ్లు క్రమం తప్పకుండా స్థిర ఆదాయం వస్తుందన్నారు.
ఆయిల్‌ పామ్‌ సాగుతో రైతులు తక్కువ పెట్టుబ డితో ఎక్కువ ఆదాయం పొందవచ్చునన్నారు.
ఎకరానికి నికరంగా రూ.లక్షన్నర ఆదాయం వస్తుందన్నారు.
గెలలో వచ్చే నూనె ఆధారంగా చెల్లింపులు చేస్తారని మంత్రి తెలిపారు.
సాగు చేసిన 4 ఏళ్ల తర్వాత పంట చేతికి రావడం ప్రారంభమవుతుందన్నారు.
ప్రతి 15 రోజులకు గెల వస్తుందన్నారు.
వరి ,చెరుకు మినహా కాఫీ, కొక్, శాండల్ వుడ్, టేక్ సహా
ఇతర అన్ని పంటలను ఆయిల్ఫామ్ సాగులో అంతర పంటలుగా సాగు చేయవచ్చునని మంత్రి తెలిపారు.
వరి వంటి పంటలు ఎకరంకు అందించే నీటితో మెక్రో ఇరిగేషన్‌ పద్దతి ద్వారా కనీసం ఐదెకరాలలో పామాయిల్‌ సాగు చేయవచ్చన్నారు. అంతేకాకుండా చీడపీడలు, దొంగతనం, అడవిజంతువులు, కోతుల బెడద వంటివి ఈ పంటకు ఉండవన్నారు.

దిగుమతులను తగ్గిం చేందుకు దేశంలోనే పంట ను ప్రభుత్వం ఆయిల్ పామ్ పంట సాగు ను ప్రోత్సహిస్తుo దన్నారు.

ఇంకా ప్రభుత్వం నుంచి ఇతరత్రా ఏవైనా సదుపాయాలు ఉంటే కూడ రైతులకు కల్పిస్తామని మంత్రి తెలిపారు.

అలాగే ఇప్పటికే ఆయిల్ ఫామ్ పంట సాగు చేస్తున్న రైతులకు నమ్మకం పెంచడం కోసం , మరింత మంది ఈ పంట సాగుకు ముందుకు వచ్చేలా
రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ, సహకారంతో అశ్వారావుపేట, దమ్మపేటలో మాదిరి సిద్దిపేట జిల్లా లోని నర్మెట్ట లో పామాయిల్‌ ఫ్యాక్టరీ నిర్మాణం పనులకు 3 రోజుల్లో భూమిపూజ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయిల్ ఫామ్ రైతులు తమకు ఎరువుల రాయితీ నిధులు , EGS డబ్బులు పడలేదని చెప్పడంతో మంత్రి ఉద్యానవన కమిషనర్ శ్రీ వేంకట్రామా రెడ్డి, పంచాయితీ రాజ్ కమీషనర్ శ్రీ శరత్ తో ఫోన్ లో మాట్లాడారు. వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. రెండు రోజుల్లో నిధులు జమయ్యేలా చూస్తామని మంత్రి తెలిపారు.
తనకు ఇష్టమైన ఆయిల్ ఫామ్ పంట సాగు లో ఫీల్డ్ అసిస్టెంట్లు, aeo లు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోనని వెంటనే చర్యలు తప్పవని హెచ్చరించారు. 11 మంది ఆయిల్ ఫామ్ ఫీల్డ్ అసిస్టెంట్లు 50 మందికి ఒక్కరి చొప్పున వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Aeo లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ…ఆయిల్ ఫామ్ పంట విస్తీర్ణం పెరిగేలా రైతులను చైతన్యం చేయాలన్నారు.

అంతకుముందు వ్యవసాయ శాస్త్ర వేత్తలు ఆయిల్ ఫామ్ సాగు మెలుకువలు రైతులకు వివరించారు.

సమావేశంలో జిల్లా ఉద్యానవన అధికారి శ్రీమతి రామ లక్ష్మీ , స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Share This Post